
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా హవా కొనసాగిస్తోంది. నిర్మాత దిల్ రాజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాటు విదేశాల్లో కూడా బెనిఫిట్ షో లు వేసారు. మొదటి రోజుకి సంబంధించిన టికెట్స్ అన్ని అప్పుడే అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజు విడుదలైన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్, నివేదా థామస్, అంజలి అనన్య నాగల్లా నటించారు. వారి పర్ఫామెన్స్ తోపాటు థమన్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి.
మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు తాము చేయని నేరానికి ఒక కేసులో చిక్కుకుపోతారు. అప్పుడు లాయర్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వారి తరఫున వాదించి వారిని నిర్దోషులుగా నిరూపిస్తారు. ఇటువంటి స్టోరీ లైన్ తో వచ్చిన వకీల్ సాబ్ చిత్రం మంచి రెస్పాన్స్ పొందుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాల్లో కూడా పవన్ కల్యాణ్ చిత్రం బాగా డబ్బులు వసూలు చేస్తోంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు పడిపోయాయి. మొదటి రోజే ఈ సినిమా 35 కోట్ల షేర్ వసూలు చేయగలదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
అయితే అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన మెరువ నరేంద్ర అనే ఒక వ్యక్తి వకీల్ సాబ్ విడుదలను ఆపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 17వ తేదీన జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలపై వకీల్ సాబ్ మూవీ ప్రభావం పడుతుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి తరఫున పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల కోసం ప్రచారం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిధిలోని దూరదర్శన్ ఛానల్ లో తప్ప మిగతా ఏ ఛానల్ లో ప్రసారం అయినా ఎన్నికల నిబంధనల కిందకు రాదని స్పష్టత ఇచ్చింది. ఎన్నికల నిబంధనలు సినిమాకు వర్తించవని.. నరేంద్ర చేసిన ఫిర్యాదు అస్సలు ఎన్నికల నియామవళి పరిధిలోకి రాదని వెల్లడించింది. ఈ తీర్పుతో పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు ఎటువంటి అభ్యంతరాలు తలెత్తకుండా పోయాయి.