ఇప్పటితరం నటీమణులు కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు. గతంలో లేని ఇప్పుడు వచ్చిందంటే వారు ఎంతటి బాధను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. గతంలో సొసైటీ గురించి, పరువు, మర్యాదల గురించి ఆలోచించినా ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్నారు..రాబోయే తరానికి లైన్ క్లియర్ చేస్తున్న వీరి చర్యలు హర్షణీయం చెప్పాలి. తాజగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
యుక్త వయసులోనే పరిశ్రమకు వచ్చిన అన్నపూర్ణ, అమ్మగా వయసుకు మించిన పాత్రలు చేయడం జరిగింది .క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. తప్పు అనేది ప్రతిసారి ఒకరివైపే ఉండదని, ఇద్దరి ప్రమేయం ఉన్నప్పుడే తప్పు జరుగుతుంది అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఒక అనవసరపు వ్యవహారం. ప్రతి రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది.కుటుంబం, గౌరవం వంటివి దృష్టిలో ఉంచుకొని మహిళలు, ఆ వేధింఫుల నుండి తప్పించుకొని వస్తున్నారు. అలాగే పరిశ్రమలో ఉన్న ఆడవాళ్లు కూడా తప్పించుకు తిరగాలి అన్నారు.ఇక ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే స్పందించాలి, మాట్లాడాలి. పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి, ఈ వేధింపులు ఎక్కువగా ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నారు.అలాగే తప్పు జరిగిన ప్రతిసారి ఒక్కరినే నిందించలేం. ఓ సంఘటన వెనుక నిజానిజాలు తెలుసుకోవాలని అన్నపూర్ణ తెలియజేశారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని, పరోక్షగా అన్నపూర్ణ తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి