తమిళనాట సూపర్ స్టార్ గా రజినీకాంత్ కొన్నేళ్లు గా సినిమా లు చేస్తూ వచ్చారు.. ఆయనకున్న క్రేజ్ దేశంలో ఏ స్టార్ కి లేదని చెప్పాలి.. వయసు పెరుగుతున్నా అయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే వచ్చారు.. నిజానికి గతంలోకంటే ఎక్కువ సినిమాలు ఇప్పుడే చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ లతో సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ తో హిట్ లు కొడుతున్నారు.. ప్రస్తుతం అయన యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో అన్నాతే సినిమాలో నటిస్తున్నాడు.

ఇటీవలే దర్బార్ సినిమా తో ఫ్లాప్ కొట్టిన రజిని ఈ సినిమా ని హిట్ చేయాలనీ చూస్తున్నాడు. తన ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచడానికి ఇష్టపడని రజిని వారి కోరిక మేరకు తనకు అంత సామర్ధ్యం లేకుండా వరుస సినిమాలు చేసి అందరిని అలరిస్తున్నాడు. అయన క్రేజ్ ఏంటో కబాలి తో మరోసారి దేశానికి తెలియజేశాడు.. ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అంతా ఇంతా కాదు.. ఆ సినిమా తో సూపర్ స్టార్ క్రేజ్ డబల్ అయ్యింది.. ఆ సినిమా ఫ్లాప్ అయినా రజిని పాపులారిటీ ఇమేజ్ చెక్కు చెదరలేదు.  ఇక రజినీ కెరీర్లో వస్తున్న ఈ 168వ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార - కీర్తి సురేష్ - మీనా - ఖుష్బు - ప్రకాష్ రాజ్ - జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కోవిడ్ కారణంగా నిలిపేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించడానికి రజినీకాంత్ చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లుక్ రిలీజ్ అయ్యింది.. ఖద్దరు చొక్కా - పంచె కట్టులో సూపర్ స్టార్ లుక్ సూపర్ కూల్ గా ఉంది. ఈ ఫొటో విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ కావడంతో పాటుగా ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: