అయితే అక్కినేని సుమంత్ తో, గౌతమ్ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పైగా ఫుల్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో గౌతమ్ ఈ సినిమా కథని రాసుకున్నాడట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. అయితే గౌతమ్ మొదటి సినిమా హీరో సుమంతే. ఆ రిలేషన్ కోసమైనా గౌతమ్ సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు.
అంతేకాదు.. గౌతమ్ లాస్ట్ మూవీ ‘జెర్సీ’ సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది. పైగా గౌతమ్ ‘జెర్సీ’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. ముఖ్యంగా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు అలాగే తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోన్నట్లు గౌతమ్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశాడట. మరి గౌతమ్ తిన్ననూరి హిందీలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి