టాలీవుడ్ లో టాప్
డైరెక్టర్ లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు
వంశీ పైడిపల్లి. ఆయన తెరకెక్కించిన 'ఊపిరి', 'మహర్షి' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. రెండేళ్లక్రితం విడుదలైన 'మహర్షి'
సినిమా అయితే
మహేష్ ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసేలా చేసింది. ఈ
సినిమా కేవలం
బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమాకి నేషనల్ అవార్డు సైతం దక్కడం నిజంగా
మహేష్ అభిమానులకి కిక్కిచ్చింది.పైగా ఇది
మహేష్ మైలు రాయి
సినిమా 25 వ
సినిమా కావడం వల్ల
మహేష్ ఫ్యాన్స్ గర్వపడుతున్నారు.ఈ
సినిమా చేస్తోన్న సమయంలోనే
మహేష్ బాబు.. వంశీతో మరో
సినిమా చేయాలనుకున్నాడు.తెలిసిందే కదా ఎంత గొప్ప దర్శకుడైన మంచి కథ తో వస్తేనే
మహేష్ ఛాన్స్ ఇస్తాడు.
సుకుమార్ విషయంలో కూడా అదే జరిగింది.అందుకే
మహేష్ కి సరిపడా కథను సిద్ధం చేయలేకపోయినందుకు
మహేష్ వంశీని హోల్డ్ లో పెట్టి ఈసారి మరో టాలెంటెడ్
డైరెక్టర్ పరశురామ్ కి ఛాన్స్ ఇచ్చి 'సర్కారు వారి పాట' సినిమాను మొదలుపెట్టాడు.
దీంతో
వంశీ పైడిపల్లి మరో స్టార్
హీరో కోసం చూశాడు.
రామ్ చరణ్ కి కూడా కథ చెప్పాడు. కానీ కుదరలేదు. ఇప్పుడు
మెగాస్టార్ చిరంజీవిపై
వంశీ పైడిపల్లి దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతుంది.ఈ మధ్యకాలంలో
చిరంజీవి చాలా మంది దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు.
బాబీ,
మెహర్ రమేష్ లాంటి దర్శకులకు కూడా ఆయన అవకాశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ లాంటి ప్లాపుల్లో ఉన్న దర్శకుడికే ఛాన్స్ ఇచ్చినప్పుడు..
వంశీ పైడిపల్లి చెప్పే కథ నచ్చితే కచ్చితంగా ఛాన్స్ ఇస్తారు.ఇటీవల చిరుకి ఓ కథ కూడా చెప్పినట్లు సమాచారం. అయితే చిరు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. చిరు ఓకే చెప్పేస్తే.. వంశీకి
హీరో దొరికేసినట్లే. ప్రస్తుతం చిరు 'ఆచార్య' సినిమాతో పాటు.. 'లూసిఫర్'
రీమేక్ లో నటిస్తున్నాడు. మరీ చూడాలి వంశీకి
మెగాస్టార్ ఛాన్స్ ఇస్తాడో లేదోనని..