
భవ్య బిష్ణోయ్.. హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు అనే విషయం తెలిసిందే. భవ్య.. ప్రస్తుతం కాంగ్రెస్ యువ నేతగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తీసుకొచ్చిందీ జంట. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ కపుల్ త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. పెళ్లి ముహుర్తం తగ్గరపడుతోన్న నేపథ్యంలో ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌తో బిజీగా గడుపుతోంది.
ఇక తాజాగా మెహరీన్ తనకు కాబోయే వాడితో కలిసి దిగిన ఓ అందమైన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ.. చేతులు పట్టుకున్న సమయంలో తీసిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఈ బంధాన్ని ఆ దేవుడు ఎప్పుడూ ఇలాగే ఆశీర్వదీస్తాడని ఆశిస్తున్నానను’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ జోడించిందీ బ్యూటీ.
అయితే మెహరీన్ కెరీర్ విషయానికొస్తే.. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతికాలంలోనే వరుస ఆఫర్లు దక్కించుకున్నారు. ఎఫ్2లో హనీ పాత్రలో నవ్వులు పూయించిన ఈ చిన్నది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఎఫ్3లో నటిస్తోంది. మరి వివాహం తర్వాత మెహరీన్ సినిమాలు కొనసాగిస్తుందా లేదా.. అన్నది చూడాలి మరి.