కరోనా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతూ.. ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువ తీవ్రతతో భారత దేశాన్ని కుదిపేస్తోంది. గత 24 గంటల్లో ఇండియాలో నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భారతదేశంలో రోజువారి కేసులు నాలుగు లక్షలు దాటడం ఇదే తొలిసారి. కరోనా తీవ్రత దృష్ట్యా భారత దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని సినిమాల దర్శక నిర్మాతలు షూటింగ్స్ నిలిపివేసారు.
ఆచార్య, రాధే
శ్యామ్, పుష్ప వంటి భారీ
టాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా నిలిచిపోయాయి. కానీ
గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం
సినిమా మాత్రం కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలోనూ నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాతో పాటు
నాని హీరోగా నటిస్తున్న "శ్యామ్ సింగ రాయ్"
సినిమా షూటింగ్ కూడా కరోనా సమయంలోనూ కొనసాగుతూనే ఉంది.
ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే.. బయట అడుగు పెడితే ఏదో ఒక సందర్భంలో
కరోనా వైరస్ సంక్రమిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో
గుణశేఖర్,
రాహుల్ సంకృత్యన్ మాత్రం అసలు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా
సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టేంతవరకు
సినిమా షూటింగ్స్ వాయిదా వేస్తే పోయేదేమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దురదృష్టవశాత్తు
సినిమా టెక్నీషియన్లలో ఎవరైనా
కరోనా వైరస్ బారిన పడితే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని.. ఈ సమయంలో బయటకు వచ్చి పెద్ద తప్పు చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే శాకుంతలం సినిమాలో నటిస్తున్న
సమంత మాత్రం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. దీంతో
గుణశేఖర్ ఇతర నటీనటులతో
సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ఇక "శ్యామ్ సింగ రాయ్"
సినిమా కోసం రూ.6 కోట్ల విలువైన సెట్స్ నిర్మించి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి నటించడం విశేషం.