
ఇక అంతే కాకుండా బాలకృష్ణ కు పోటీగా ఫ్యామిలీ హీరోగా పిలిపించుకున్న శ్రీకాంత్, ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా విలన్ గా నటించడం విశేషం. మొన్న ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదలయిన విషయం తెలిసిందే. ఇక ఒక్క రోజులోనే ఈ టీజర్ 50 మిలియన్ల కు పైగా వ్యూస్ ని సాధించి, రికార్డు సృష్టించింది. అంటే ఈ టీజర్ కు వచ్చిన వ్యూస్ ని చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా కి ప్రేక్షకులలో హైప్ ఎంత ఉందో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ఇటీవల ప్రేక్షకులు ఈ సినిమా నుంచి పాటలు, ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తూ ఉండగా, ఇక అందుకు ప్రొడ్యూసర్ బి.ఏ.రాజు త్వరలోనే లహరి మ్యూజిక్ కింద ఒక పాటను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు..
సాధారణంగా ఈ సినిమాను కరోనా విజృంభించకుండా ఉండుంటే మే 28 2021 న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు సిద్ధం చేసింది. కాకపోతే కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డ తరుణంలో ఈ సినిమాను ఇప్పుడే రిలీజ్ చేసేటట్టు కనిపించడం లేదు. ఒకవేళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ సినిమా పాటలు కనుక విడుదల అయితే,వాటికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి మరి.. ఇక ఈ సినిమాకు ఎస్ థమణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..