ఇంటర్నెట్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ అంటే ఓ ప్రత్యేకత ఉంది. ఆర్జీవీని పిచ్చోడని తిట్టేవారూ ఉన్నారు. కాదు అతడు అపర మేధావి అని పొగిడేవారూ ఉన్నారు. అయితే ఈ రెండింటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటాడు ఆర్జీవీ. ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేస్తుంటాడు. ఎవరిని విమర్శించాలనిపిస్తే నిర్మొహమాటంగా విమర్శించేస్తాడు. అవసరమైతే వారిపై సినిమాలు కూడా తీసి రివెంజ్ తీర్చుకుంటాడు. ఇక సోషల్ మీడియాలో ఆర్జీవీ ట్వీట్లతో చేసే రచ్చ అంతా ఇంతాకాదు. ఎప్పుడు ఏ కొత్త ట్వీట్ పెడతాడా..? ఈ సారి ఎవరిపై ఈ ట్వీట్ ఉంటుందా..? అని అంతా తెగ వెయిట్ చేస్తుంటాడు. దానికి తగ్గట్టే ఆర్జీవీ కూడా వెరైటీ ట్వీట్లు చేస్తూ తన మార్క్ చూపిస్తుంటాడు. అయితే ఆర్జీవీ తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్‌, అతడి భార్యపై ఓ సంచలన ట్వీట్ చేశాడు. ఇప్పుడా ట్వీట్ ట్విటర్‌లో తెగ వైరల్ అవుతోంది.

బిల్ గేట్స్ తాజాగా తన భార్య మెలిండా గేట్స్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల సుదీర్ఘ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు బిల్-మెలిండా గేట్స్‌లు సంయుక్తంగా ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ క్రమంలోనే బిల్ గేట్స్ పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు విడిపోవడంపై ఎమోషనల్ పోస్ట్‌లు పెట్టారు.

ఇక ఆర్జీవీ కూడా గేట్స్ దంపతులు విడిపోవడంపై ఈ రోజు ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందుల్లో ఇదొకటి. భార్యభర్తలే ఒకరికొకరు తలనెప్పిగా మారతారు’ అని రాసుకొచ్చారు. దానికి చెన్నై మీమ్స్ అనే ఓ ఫేస్‌బుక్ పేజ్‌లోని ఓ పోస్ట్‌ను కూడా జత చేశాడు. ఆ పోస్ట్‌లో రెండు ఫోటోలున్నాయి.

ఓ ఫోటోలో 2019లో బిల్ గేట్స్ తన భార్య మెలిండా గేట్స్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ.. మరో 25 ఏళ్లు ఆమెతో ఆనందంగా కలిసి జీవించాలనుకుంటున్నానంటూ రాసుకొచ్చింది ఒకటి కాగా.. మరో ఫోటోలో 2021.. అంటే ఈ ఏడాది ఆమెతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఫోటో. దీనికి షెల్టన్ మహరేష్ అనే ఎఫ్‌బీ యూజర్ ‘బహుశా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారేమో’ అని కామెంట్ చేశాడు. దీనిపైనే ఆర్జీవీ కామెంట్ చేశాడు.

కాగా.. ఆర్జీవీ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనికి దాదాపు 2వేలకు పైగా లైక్స్ రాగా.. వందల సంఖ్యలో రీట్వీట్లు కూడా అయ్యాయి. ఈ ట్వీట్‌కు ముందు ఆర్జీవీ కరోనాకు సంబంధించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొన్ని అద్భుతమైన ట్వీట్లు చేశాడు.





మరింత సమాచారం తెలుసుకోండి: