వివాదాస్పద దర్శకుడు
రామ్ గోపాల్ వర్మ ఆలోచనా విధానం ఎవరికీ అంతుచిక్కదు. బంధాలు, బంధుత్వాలు లేకుండా ఒక్కడే ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఆశ్చర్యపరుస్తున్న
ఆర్జీవీ తన సొంత
జీవిత సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఎవరేమనుకున్నా తాను మాత్రం అస్సలు మారకుండా ఎప్పటికీ ఒకే లాగా ఉంటారు. ఆయన ఎవరికీ భయపడకుండా బయోగ్రఫీలు చేస్తుంటారు. భారతదేశ చిత్ర పరిశ్రమలో
ఆర్జీవీ కి ఉన్న ధైర్యం ఎవరికీ లేదని చెప్పుకోవచ్చు. ఏ విషయంపైనా మాట్లాడగల సత్తా ఉన్న
ఆర్జీవీ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు.
టాలీవుడ్ లో ఏ దర్శకుడికి లేని ఫ్యాన్ ఫాలోయింగ్
ఆర్జీవీ కి ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన పలు విషయాలపై వెల్లడించే కొన్ని అభిప్రాయాలు మిగతా ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తాయి.
ఒక విషయంలో
ఆర్జీవీ తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అదేంటంటే భవిష్యత్తులో మంచాన పడి ఒకరి సహాయం లేనిదే జీవించ లేకపోయినా.. లేక ఏదైనా జబ్బు వచ్చినా తన ని చంపేయాలని ఒక కాంట్రాక్టర్ కిల్లర్ కి
ఆర్జీవీ సుపారీ ఇచ్చారట. నిజానికి చాలా ఇంటర్వ్యూలలో తనకు దయనీయమైన పరిస్థితి వస్తే చచ్చి పోవడానికి ఇష్టపడతానని చెప్పారు. కానీ తాజా ఇంటర్వ్యూలో మాత్రం తనకు అలాంటి పరిస్థితి రాగానే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేత తనని తాను
మర్డర్ చేయించుకుంటానని
ఆర్జీవీ చెప్పి షాకిచ్చారు.
అయితే తనకు ఎటువంటి మరణం కావాలో మాత్రం తాను వెల్లడించలేదు. అయితే తన చివరి రోజుల్లో తనను పరామర్శించడానికి ఎవరూ రావాల్సిన అవసరం లేదని.. తన కుమార్తె రాకపోయినా పర్లేదని ఆయన చెప్పుకొచ్చారు. తానేంటో, తానేంత స్వార్థపరుడో తన కూతురికి తాను చెప్పానని.. తన నుంచి ఏ
ప్రేమ ఆశించవద్దని తాను వివరించానని కూడా
ఆర్జీవీ చెప్పారు. ఏది ఏమైనా
రామ్ గోపాల్ వర్మ ను మినహాయించి డబ్బులిచ్చి మరీ తనను తాను చంపించుకునే మనిషి ఈ ప్రపంచంలో మరెవరూ లేరేమో.