నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం మూవీ ద్వారా హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తరువాత వరుణ్ తేజ్ తో ముకుంద మూవీ చేసింది. ఆపై బాలీవుడ్ లో ఏకంగా హృతిక్ రోషన్ తో మోహెన్జదారో మూవీ చేసిన పూజ దాని తరువాత తెలుగులో అల్లు అర్జున్ తో హరీష్ శంకర్ తీసిన డీజే లో కూడా నటించింది. అయితే ఆ సినిమాల ద్వారా ఆమెకు ఆశించిన స్థాయి గుర్తింపు మాత్రం లభించలేదు. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత మూవీ తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న పూజా హెగ్డే, కెరీర్ పరంగా బ్రేక్ ని సొంతం చేసుకుంది.


ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి, మరొక్కసారి వరుణ్ తేజ్ తో నటించిన గద్దలకొండ గణేష్, అలానే గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో మూవీ లో కూడా హీరోయిన్ గా నటించిన పూజా, ఆ సినిమాల ద్వారా వరుసగా విజయాలు సొంతం చేసుకుని ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ భామగా మంచి పేరుతో దూసుకెళుతోంది. అల మూవీలో బంటుగా అల్లు అర్జున్, మేడం గా పూజా హెగ్డే పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే త్వరలో మరొక్కసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా కు సైన్ చేసినట్లు తెలుస్తోంది.
 

వాస్తవానికి అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమా తీయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పూజా నే హీరోయిన్ గా ఎంపిక చేసారు అంటూ కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ, ఆమెను సెలక్ట్ చేసింది మహేష్ తో చేయబోయే సినిమా కోసం కాదని, ఆ మూవీ తరువాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేయబోయే పాన్ ఇండియా మూవీ కోసం అని సమాచారం. ఇప్పటికే ఆ మూవీ స్టోరీ సిద్దమవ్వగా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా త్రివిక్రమ్సినిమా తీయనున్నారని అంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ తదుపరి కొరటాల, ప్రశాంత్ నీల్ ల సినిమాల అనంతరం త్రివిక్రమ్ మూవీ చేయనున్నట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త పై అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది ... !!

మరింత సమాచారం తెలుసుకోండి: