యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే 20వ తేదీన తన పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులతో పాటు చాలామంది సెలబ్రిటీలు బర్తడే విషెస్ తెలిపారు. కొందరు వీరాభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కోసం అద్భుతంగా ఫోటోలు రూపొందించి చాలా స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే జూ. ఎన్టీఆర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మహేష్ కోనేరు.. కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా జూ. ఎన్టీఆర్ యొక్క ఇద్దరు కొడుకులకు సంబంధించి కొత్త విషయాలను బయటపెట్టారు.


"జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ కి చాలా సిగ్గు. అభయ్ రామ్ చాలా సైలెంట్ గా ఉంటాడు. చిన్న కొడుకు భార్గవ రామ్ మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటూ బాగా అల్లరి చేస్తాడు. భార్గవ రామ్ అచ్చం తన తండ్రి లాగానే ఉంటాడు. వీళ్లిద్దరి వ్యక్తిత్వం వేరు అయినప్పటికీ.. ఒకరితో ఒకరు కలిసి సమయం గడపడానికి బాగా ఇష్టపడతారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన పిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తారు. ఖాళీ సమయాల్లో సాధ్యమైనంతవరకు తన పిల్లలతో టైం స్పెండ్ చేసేందుకు ఆయన బాగా ప్రయత్నిస్తారు", అని ఆయన చెప్పుకొచ్చారు.



అయితే జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలకు సంబంధించి ఎటువంటి వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఎందుకు పంచుకోరు? అని ప్రశ్నించినప్పుడు.. "పబ్లిక్, మీడియా నుంచి తన పిల్లలను దూరంగా ఉంచాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారు. తన స్టార్డమ్ తన పిల్లలపై ప్రభావం చూపకూడదు అని ఎన్టీఆర్ జాగ్రత్త పడుతున్నారు" అని మహేష్ కోనేరు వెల్లడించారు.



ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కరోనా వైరస్ బారిన పడిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులందరూ హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం తారక్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వారిలో ఇప్పటివరకు ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. త్వరలోనే తారక్ కూడా కరోనా నుంచి కోలుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: