పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోక ముందు ఒక అమ్మాయిని బాగా ప్రేమించారు. కానీ అతని ప్రేమ భగ్నం కావడంతో తట్టుకోలేక పోయారు. ఆ బాధ నుంచి బయట పడటానికి పవన్ కి చాలా కాలం పట్టింది. పవన్ భగ్న ప్రేమ గురించి వివరంగా తెలుసుకుంటే.. చెన్నైలోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి పై మనసు పారేసుకున్నారు. ఆ సమయంలో ఆయన ప్రతి రోజు సాయంత్రం కంప్యూటర్ క్లాస్ కి వెళ్లేవారు. అయితే అదే క్లాస్ కి ఒక అందమైన అమ్మాయి కూడా వచ్చేవారు. దీంతో స్టూడెంట్స్ అందరూ ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించేవారు కానీ ఆ అమ్మాయి మాత్రం ఎవ్వరినీ పట్టించుకునేవారు కాదు.


అయితే ఇతర స్టూడెంట్స్ తో మాట్లాడటానికి ఇష్టపడని ఈ అమ్మాయి పవన్ తో మాత్రం తెగ మాట్లాడేవారు. సిగ్గు, బిడియం కలిగిన పవన్ మొదట్లో ఆ అమ్మాయితో సరిగా మాట్లాడేవారు కాదు కానీ తర్వాత ఆమెతో చనువు పెంచుకున్నారు. కాలక్రమేణా వీళ్లిద్దరూ బాగా క్లోజ్ అయ్యి.. అన్ని విషయాలను పంచుకోవడం ప్రారంభించారు. మరోవైపు ఇదంతా గమనిస్తున్న తోటి విద్యార్థులు.. "అమ్మాయి కచ్చితంగా నిన్ను ప్రేమిస్తుంది, రా. త్వరగా ప్రపోజ్ చెయ్" అంటూ బాగా ఉసిగొల్పారు. "ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం ఏంట్రా?, అలాంటిదేమీ లేదు" అని పవన్ తొలుత వారి మాటలను కొట్టిపారేశారు. కానీ ఆ మాటలు తనపై ప్రభావం చూపడంతో పవన్ కూడా తనని ఆ అమ్మాయి నిజంగానే ప్రేమిస్తుందేమోనని ఆలోచించసాగారు.



అమ్మాయి తనని ప్రేమిస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని పవన్ తెగ ఉబలాటపడ్డారు. చివరికి ఒక రోజు ధైర్యం చేసి ఆమెను డేట్ కి పిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత తన గ్యారేజ్ లో ఉన్న ఒక కారుని సర్వీసింగ్ కి ఇచ్చి చక్కగా క్లీన్ చేయించారు. కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళగానే "ఈ రోజు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, మీరు కూడా వస్తారా?" అని ఆతృతగా అమ్మాయిని అడిగారు. దీనితో ఆ అమ్మాయి వెంటనే "హా, వస్తాను. రేపు పొద్దున్నే మా ఆఫీస్ వద్ద నన్ను పికప్ చేసుకో" అని నిస్సంకోచంగా సమాధానమిచ్చారు. దీంతో యాహు అంటూ ఎగిరి గంతేసిన పవన్ మరుసటి రోజు శోభన్ బాబు మాదిరి అందంగా తయారయ్యి ఆ అమ్మాయి ఆఫీస్ ముందు వాలిపోయారు.



అయితే ఆ అమ్మాయి రావడం.. కారు ఎక్కడం చకచకా జరిగిపోయాయి. అప్పటికే పవన్ హార్ట్ బీట్ అత్యంత వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. దీంతో ఆయనకు చెమటలు విపరీతంగా పట్టేశాయి. ఒకవైపు డ్రైవింగ్ చేస్తూనే మరోవైపు ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ పవన్ తెగ ఇబ్బంది పడి పోయారు. ఆఖరికి ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశారు. ఆ మాటలు వినగానే తీవ్ర కోపోద్రిక్తురాలైన సదరు అమ్మాయి.. నీ వయసెంత నా వయసెంత.. చనువుగా మాట్లాడగానే ప్రపోజ్ చేయడమేనా? కొంచమైనా కామన్సెన్స్ ఉండాలి కదా.. చిఛీ, అసలు నీతో నేను ఇంకా ఎప్పుడు మాట్లాడను అని కారు దిగి వెళ్లిపోయారట.



అసలే మొదటి ప్రేమ.. అదీ బాగా పరిచయం ఉన్న అమ్మాయి తిరస్కరించడంతో పవన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలాగోలా లవ్ ఫెయిల్యూర్ కి సంబంధించిన డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. అయితే తన విషాద ప్రేమ కథ గురించి గోకులంలో సీత సినిమా ప్రమోషన్ సమయంలో ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: