

ఆమె కెరీర్ లో ది బెస్ట్ సినిమా ఏది అంటే యుగానికొక్కడు అని చాలా సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలకు దూరమైన తరువాత ఆమె 2012లో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన శివకరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.కరణ్‌సింగ్ ఓ ప్రముఖ రెస్టారెంట్స్ గ్రూప్స్‌కు అధినేత. ఈయనకు ప్రతి రాష్ట్రంలోనూ రెస్టారెంట్లు ఉన్నాయి. రిమాసేన్‌ను తొలి చూపులోనే ప్రేమించిన కరణ్‌సింగ్ 2012లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట కి ఒక ఏడేళ్ల బాబు ఉన్నాడు. ఏదేమైనా ఇంత ఎంజాయ్ లైఫ్ ను అనుభవిస్తున్న రీమాసేన్ సినిమాల తర్వాత తన గురించి వార్తలు బయటికి రాకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు. ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.