తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ హీరో విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం"అపరిచితుడు" . ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో విక్రమ్ త్రి పాత్రాభినయం చేసి అందరిని అలరించాడు. అంతేకాకుండా ఈ సినిమాను  సమాజంలో ఉండే పరిస్థితులను తెలియజేస్తూ తీసిన సినిమా అపరిచితుడు. అయితే సినిమా 17-6-2005  రిలీజ్ అయ్యి ఇప్పటికీ పదహారేళ్లు కావస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ ని సంపాదించుకుంది.

ఈ సినిమాని తమిళంలో "అన్నియన్" పేరుతో విడుదలై  ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ను సంపాదించుకుంది. ఇక అదే సినిమా తెలుగులో అపరిచితుడు గా రిలీజ్ అయింది. ఇందులో రామానుజన్, అపరిచితుడు, రెమో వంటి పాత్రలలో అందరినీ అలరించాడు. ఈ సినిమాలో నటన విక్రమ్ కే సాధ్యం అని, మరో నటుడు ఎవరూ చేయలేనంతగా నటించాడు విక్రమ్.
ముఖ్యంగా శంకర్ సినిమాకి ఎప్పుడూ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించేవారు. కానీ ఈ సినిమాకి మాత్రం హరి జయరాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రం ద్వారానే హీరో విక్రమ్ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక బడ్జెట్ విషయానికొస్తే, రూ. 26 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించగా, అన్ని భాషలలో మొత్తం కలిపి రూ.56 కోట్ల మేరకు షేర్ ను రాబట్టింది. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రూ. 6.7 కోట్ల బిజినెస్ చేయగా.. ఏకంగా రూ. 14 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. అంతేకాకుండా కొంతమంది  బయ్యర్ల కు పెట్టిన దానికంటే ఎక్కువ అమౌంట్ రావడం గమనార్హం. అంతేకాకుండా ముందుగా ఈ అపరిచితుడు సినిమాని రజినీకాంత్ కి వినిపించారట. కానీ ఆయన నో చెప్పడంతో విక్రమ్ తో తీసి హిట్ కొట్టాడు శంకర్. రజినీకాంత్  శంకర్ సినిమాకు నో చెప్పడం ఇది  రెండోసారి. అప్పుడు ఒకే ఒక్కడు సినిమాను కూడా నో అని చెప్పారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఐశ్వరరాయ్ ని అనుకోగా.. ఆమె బాలీవుడ్ లో బిజీగా ఉందని, సిమ్రాన్ ని అడగగా ఆమె తన పెళ్లి ఉందంటూ డేట్స్ ఖాళీ లేవు అంటూ చెప్పుకొచ్చింది. చివరిగా జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సదా కి ఇందులో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: