అయితే సాధారణంగా ‘కాలాతీత వ్యక్తులు’ ప్రేరణతో 1963లో వచ్చిన చదువుకున్న అమ్మాయిలు సినిమాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయితే మహానటి సావిత్రి, కృష్ణకుమారి, సరోజ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును సావిత్రి, కృష్ణకుమారి లవ్ చేసుకుంటారు. ఇక అక్కినేని మనసులో కృష్ణకుమారి ఉంటుంది.
అలాగే పోలీస్ ఇన్‌స్పెక్టర్ రోల్ చేసిన శోభన్‌బాబుకి సావిత్రి భార్యగా నటిస్తుంది. ఇక సావిత్రి కంటే కృష్ణకుమారి,సరోజ కాస్త పొడవుగా ఉంటారు. ఈ చిత్రంలో ఆ ముగ్గురు హీరోయిన్స్ కాంబినేషన్ సీన్లలో తను పొట్టిగా కనపడకుండా ఉండేలా సావిత్రి ఓ ట్రిక్ ప్లే చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇక సావిత్రి తోడుగా దాక్షాయణి అనే అమ్మాయి ఉంటూ సావిత్రి మేకప్ వంటివన్నీ శ్రద్ధగా చూసుకునేది. అయితే ఆమె ఏ సన్నివేశంలో ఏ నగలు పెట్టుకుందో.. ఏ చీర కట్టుకుందో కేశాలంకరణ వివరాలతో పాటు సన్నివేశం తర్వాత వచ్చే సన్నివేశం వివరాలు అన్నీ ఓ పుస్తకంలో రాసుకుంటూ ఉండేది.
ఇక సొంత నగలు వాడితే సహాయ దర్శకుడికి ఆ వివరాలు తెలియజేసేది. అంతేకాదు.. ఎప్పుడు మళ్లీ అవసరం వచ్చినా, సన్నివేశం చెబితే ఆ నగలన్నీ ఆ అమ్మాయి తీసుకొచ్చేది. అలాగే ఈ సినిమాలో సావిత్రి, కృష్ణకుమారి, సరోజ కలిసి వుండే సీన్స్ లో వాళ్లిద్దరి కంటే తను పొట్టి కాబట్టి, సింగపూర్ నుంచి ప్రత్యేకించి తేప్పించుకున్న హైహీల్స్ సావిత్రి వేసుకుంటుంది. ఇక సెట్స్ మీద ఎప్పటికప్పుడు సావిత్రికి సంబంధించిన షాట్స్ గమనించే దాక్షాయణి, ఆ ముగ్గురి షాట్స్ ఎప్పుడు తీస్తున్నా, సైలెంట్ గా సావిత్రి కాళ్ల దగ్గరకు ఆ చెప్పులు తెచ్చి, అక్కా! ఆ చెప్పులు తెచ్చానని చెవిలో చెప్పి వెళ్తుండేది. ఆలా సావిత్రి ఎక్కడా పొట్టిగా కన్పించకుండా సావిత్రి జాగ్రత్త పడుతుండేది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి