మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాలు రికార్డులు బ్రేక్ చేసేవిలాగానే ఉంటాయి. ఏ సినిమా అయినా అందులో చిరు న‌ట‌నే హైలెట్‌గా ఉంటుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ డైరెక్ష‌న్‌లో చేస్తున్న ఆచార్య మూవీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న  సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో కీల‌క పాత్రలో నటిస్తున్న విష‌యం తెలిసిన‌ప్ప‌టినుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి.

ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చాక తన సరికొత్త లుక్ తో ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తూనే ఉన్నారు. మరి ఆచార్య మూవీ కోసం కూడా కాస్త డిఫరెంట్ హెయిర్ స్టయిల్ ట్రై చేసి కొత్తగా క‌నిపించారు. మరి వీటితో పాటుగా వేదాళం రీమేక్ మూవీ కోసం కూడా గుండు లుక్ మేకోవర్ చేసి ఆశ్చర్యపరిచారు మెగాస్టార్‌. ఇప్పుడు దాని తర్వాత షూటింగ్ నుంచి కొంచెం బ్రేక్ లో ఉన్న చిరంజీవి నుంచి ఓ వీడియో ఇప్పుడు బయటకి వచ్చింది దీనిలో నీలకంఠపురం దేవాలయాలు ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు ఆయ‌న‌.


అయితే ఈ వీడియో మెగాస్టార్ చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెస్మ‌రైజ్ చేశారు. దీంతో ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఎలాగో షూట్ కి కూడా టైమ్ దగ్గర పడ‌టంతో ఈ లుక్ కూడా ఆచార్యలో ఉంటుందా అన్న డౌట్స్ విప‌రీతంగా పెరిగి పోతున్నాయి. అవన్నీ ఏమో కానీ ప్రస్తుతం అయితే చిరంజీవి లుక్ ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది..


ఏదేమైనా ప్ర‌తి సినిమాకు కొత్త లుక్ ట్రై చేసే చిరంజీవి ఇప్పుడు ఈ సినిమా కోసం చేస్తున్న లుక్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ ఏజ్‌లో కూడా లుక్ విష‌యంలో మెగాస్టార్ తీసుకుంటున్న కేర్ మెచ్చుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: