పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా ఏకే రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా తర్వాత ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. రానా మరో కథానాయకుడిగా నటిస్తుండడంతో ఈ మల్టీస్టారర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాని రిలీజ్ చేయనుండటంతో ఈ సినిమాపై అందరి లో ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ మేనియా ఇంకా తగ్గలేదని వకీల్ సాబ్ సినిమా నిరూపించింది.. ఈ సినిమా భారీ హిట్ తో పవన్ కి మంచి ఇమేజ్ వచ్చింది.. దాంతో ఏకే రీమేక్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. త్రివిక్రమ్ రచన అందించడం కూడా ఈ సినిమా పై అంచనాలకు ఓ కారణం అయిది. ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసే ఈ ఆలోచన చేస్తున్నారట మేకర్స్. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ జరగకపోవడం తో విడుదల ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. కరోనా లేకుండా ఉంటే షూటింగ్ కు బ్రేక్ రాకుండా ఉంటే దసరాకి విడుదల చేసేవారట.

ఇప్పుడు 40 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ 60 శాతం సంక్రాంతి లోపు పూర్తి చేసి ఆ పండగ కి రిలీజ్ చేయాలనేది నిర్మాతల ఆలోచన. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలు కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం లోని హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలోని మాస్ మసాల చిత్రాలు కూడా ఈ సినిమా విడుదలైన తక్కువ గ్యాప్ లోనే విడుదల చేయాలని చూస్తున్నాడు పవన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: