ఈమధ్య తెలుగు సినిమా టైటిల్స్ ఎంతో వెరైటీ గా ఉంటున్నాయి. కథకు తగ్గ టైటిల్ పెట్టడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అందులోనూ తెలుగులో వేలకొలది సినిమాలు వచ్చిన తర్వాత టైటిల్ పెట్టడం ఎంతో కష్టం అయిపోయింది. అయినా కూడా ప్రేక్షకులకు నచ్చే విధంగా, కథకు తగిన టైటిల్స్ పెట్టడంలో మన దర్శకులు సక్సెస్ అవుతున్నారు. చాలా లోతుగా ఆలోచిస్తే గాని వారు పెట్టిన టైటిల్ యొక్క అర్థం అందరికీ తెలియదు. కొన్ని కొన్ని సార్లు టైటిల్ దొరక పాత సినిమా టైటిల్స్ నీ పెడుతూ సినిమాను వెళ్లదీస్తుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కబోతున్న సినిమాల టైటిల్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయో చూద్దాం.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆయన గత సినిమాల లాగానే ఎంతో వెరైటీగా టైటిల్ ను పెట్టారు. ఈ చిత్ర టైటిల్ ను రివీల్ చేసిన రోజు సోషల్ మీడియాలో పెద్దఎత్తున హంగామా జరిగింది. జాతిరత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టి అనుష్క కాంబినేషన్ లో వచ్చే సినిమా టైటిల్ ఎంతో వెరైటీ గా ఉండబోతోందని తెలుస్తోంది. నిఖిల్ హీరోగా సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమా 18 పేజెస్ టైటిల్ కూడా వినూత్నంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

అల్లు అర్జున్ పుష్ప తర్వాత చేయబోతున్న సినిమా పేరు ఐకాన్ కనబడుటలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా టైటిల్ కొంత వెరైటీగా ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న అంటే సుందరానికి సినిమా టైటిల్ కొంత కామెడీగా జంధ్యాల స్టైల్ లో ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబి సారా, శర్వానంద్ మహా సముద్రం, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా లు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని తోపాటు క్యూరియాసిటీ కడా పెంచుతుంది. మరి టైటిల్ ల లాగానే సినిమాలో కూడా వెరైటీని ఈ సినిమాలో చూపిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: