టాలీవుడ్ లో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన కథానాయకులంతా ఇప్పుడు బుల్లితెర ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులు తమను మర్చిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విధంగా ఎంతో మంది అలనాటి తారలు బుల్లితెరపై వెండితెర పై మెరుస్తూ ప్రేక్షకులను మళ్లీ ఆరాధిస్తూ వస్తున్నారు. ఆ విధంగా ఒకప్పుడు వెండితెర ప్రేక్షకులను తన అందచందాలతో నటనతో అభినయంతో ఎంతగానో అలరించింది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బుల్లితెర జడ్జిగా మళ్లీ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు
హీరోయిన్ ఇంద్రజ.
ఇటీవలే ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పగా అందులో తన ప్రేమకథ
పెళ్లి జరిగిన విధానం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన
అమ్మాయి అయిన
ఇంద్రజ ఒక ముస్లిం వ్యక్తిని
పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే దీనికి వివరిస్తూ మతానికి మనసుకి నచ్చడానికి దానికి సంబంధం లేదు. ఒకరినీ చూసి ఒకరం ఇష్టపడ్డాము. మతం కులం చూసి ఇష్టపడము కదా.. నేను చెప్తే
సినిమా డైలాగ్ లా ఉంటుంది కానీ ఇది మాత్రం
సినిమా డైలాగ్ ఎంత మాత్రం కాదు. నా రియల్ లైఫ్ డైలాగ్ అంటూ తన వైవాహిక జీవితం గురించి చెప్పారు ఇంద్రజ.
మా ప్రేమ,
పెళ్లి ఎలా జరిగాయి అంటే మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. మేమిద్దరం ఫ్రెండ్స్ గా ఆరేళ్లు ఉన్నాం. పరిచయం అయిన వెంటనే
పెళ్లి చేసుకోలేదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం జరిగాయి. అతను నాకు పూర్తిగా సపోర్టు ఉంటాడనే నమ్మకం కలిగింది .అదే నమ్మకం ఆయనకి కూడా కలిగి ఉండొచ్చు. అందుకే
పెళ్లి చేసుకున్నాం. ఆయనకు ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి. ఆయన రచయిత. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. అంతేకాదు యాడ్ ఫిలిం మేకర్ కూడా. మా మావయ్య వాళ్ళకు బిజినెస్ ఉంది. ఆయన, వాళ్ళ
అన్నయ్య కాలిఫోర్నియాలో ఉంటారు.