క్రాక్
సినిమా తో ఈ సంవత్సరం బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు రవితేజ. ఆల్మోస్ట్ మూడేళ్లుగా హిట్ లేక నాలుగో యేడు ఎట్టకేలకు ఫామ్ లో కి వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శ్రుతి హాసన్
హీరోయిన్ గా తెరకెక్కిన ఈ
సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల ను ఎంతగానో మెప్పించింది. దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి
రవితేజ కు
బ్లాక్ బస్టర్ హిట్ అందించిన
సినిమా ఇది. తన కెరీర్లోనే నెంబర్ వన్
మూవీ ని చేసిన
రవితేజ దాని తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే.
రమేష్
వర్మ దర్శకత్వంలో కిలాడి అనే
సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ
సినిమా విడుదల కాకముందే
బాలీవుడ్ లో భారీ రేటుకి రైట్స్
సల్మాన్ ఖాన్ కొనుక్కోవడం విశేషం. దీనివల్ల ఈ సినిమాకి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. బాక్సాఫీస్ వద్ద సెకండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఈ
సినిమా దుమ్ము లేపి ఉండాల్సింది కానీ సెకండ్ వేవ్ వలన ఈ
సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో మిగిలిన సినిమాల మాదిరిగా ఈ
సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఇక డిజిటల్ రిలీజ్ చేయాలని, ఓ టీ టీ లు భారీ రేటు ఇస్తున్నాయని ఒకటి తర్వాత ఒకటి వార్తలు రాగా
నిర్మాత కలుగజేసుకుని ఈ
సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు.
అయినా కూడా ఈ సినిమాకి ఓ టీ టీ ఆఫర్స్ రావడం ఆగలేదట. ఏకంగా నలభై రెండు కోట్ల రేటు
రవితేజ సినిమా కి ఆఫర్ రాగా దాన్ని కూడా రిజెక్ట్ చేశారట. రీసెంట్ గా ఇంకాస్త రేటు పెంచి రౌండ్ ఫిగర్ 50 కోట్లు రేటు ఇవ్వడానికి కూడా సిద్ధం అయినట్లు చెబుతున్నారట. అయినా కూడా
నిర్మాత ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి చూస్తున్నారట. ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు చేయడంతో చేసేదేమిలేక ఓటీపీ సంస్థలు వెనక్కి తగ్గారట. మరి పరిస్థితులు నార్మల్ అయిన వెంటనే వచ్చే
సినిమా లో ఉన్న కిలాడి
సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో
నిర్మాత ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధిస్తుందో చూడాలి.