టాలీవుడ్ లో టాలెంట్ బాగా ఉన్న, బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉన్నా అదృష్టం లేని హీరో ఎవరంటే అఖిల్. అయన చేసిన మూడు సినిమాలతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు. దాంతో ఆయన సినీ ఎంట్రీ సాధారణంగానే మిగిలిపోయింది. ఇతర స్టార్ హీరోల కొడుకులు ఒకటి రెండు సినిమాలతోనే హిట్ సాధించి హీరోలుగా నిలబడ్డారు. కానీ అఖిల్ మాత్రం ఇంతవరకు హీరోగా హిట్ కొట్టకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో కలచివేస్తుంది. ఎంతో ఆశపడి మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చేసిన తొలి చిత్రం అఖిల్ సినిమా ఫ్లాప్ అయ్యింది.

 క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన హలో సినిమా కూడా యావరేజ్ గా మిగిలింది.  ఇక మూడో సినిమా మిస్టర్ మజ్ను అనే సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇప్పుడు నాలుగో సినిమా నీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ సినిమా చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోండగా ఈ సినిమా అయినా ఆయనకు హిట్ వచ్చి హీరో గా నిలబెడుతుందో చూడాలి. 

ఇకపోతే ఈ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే తదుపరి రెండు చిత్రాలను స్టార్ డైరెక్టర్లతో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐదో సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమానీ చేయబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా అంటే అఖిల్ హిట్ కొడతాడని ప్రేక్షకులు నమ్ముతున్నారు. స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లు తీయడం లో రెడ్డి దిట్టా. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆయన సినిమాల చేస్తాడు కాబట్టి  అఖిల్ తో చేసే మాస్ హిట్ గా ఆ సినిమా మిగిలిపోతుందని భావిస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇకపోతే ఈ సినిమాలోని కీలక పాత్రకు మలయాళం హీరో మమ్ముట్టి ని ఎంపిక చేశారు.  ఈ నేపథ్యంలో అఖిల్ కు ఆయన్ని తీసుకు రావడంతో అఖిల్ కి ఇంత ఎలివేషన్ ఇవ్వడం అవసరమా అని సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వేస్తున్నారు నెటిజెన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: