రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. వాటిలో ముందుగా రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. షూటింగ్ లో పలు మార్పులు చేయడంతో ఎప్పటికప్పుడు విడుదల వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో అభిమానులు ఎన్నో సార్లు చిత్ర యూనిట్ పై మండిపడ్డారు. ఎట్టకేలకు ఈ మధ్యలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది అని తెలుస్తోంది.

సినిమా తరువాత ప్రభాస్ సలార్ సినిమాని తన తదుపరి చిత్రం గా విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రశాంత్ నీల్  ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరొక హీరోయిన్ పాత్ర కూడా ఉందట. దానికోసం ప్రభాస్ టాలీవుడ్ చందమామ కాజల్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో చాలా సినిమా లు రాగా ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఆయన కాజల్ కి మరో ఛాన్స్ ఇవ్వడం గమనార్హం.  ఆమెకు పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ కొంతవరకే ఉన్న కూడా ఆమెను తీసుకోవడం విశేషం. హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది కాజల్.

ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్.. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది అంటున్నారు.  విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ వెరైటీ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ ను చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకొనే నటిస్తుంది.  ఈ భారీ చిత్రాన్ని అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: