ప్రస్తుతం మానవ సమాజం లో సెంటిమెంట్ అనే పదానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు  ఏ పని చేయాలన్నా ముహూర్తం, ఏ కార్యక్రమం చేయాలన్నా టైం అనేది అన్ని చూసుకుని చేస్తున్నారు. ఆ విధంగా చేసే తమ పనులు సక్సెస్ అవుతాయని, వారు విజయం సాధిస్తారని నమ్మకం. ముఖ్యంగా సినిమా వాళ్ళు అయితే ఈ సెంటిమెంట్ ను ఎక్కువగా నమ్ముతారు. సినిమా ప్రారంభం దగ్గర్నుంచి విడుదల అయ్యేదాకా ప్రతి ఒక్కటి సెంటిమెంట్ ప్రకారమే చేస్తూ వారికి దాని పట్ల ఎంత నమ్మకం ఉందో తెలియజేస్తారు.

 సెంటిమెంట్ ప్రకారం తమ పేరున మార్చుకోవడానికి కూడా వెనుకాడరు సినిమా వాళ్ళు. వారు మాత్రమే కాకుండా చాలామంది సెంటిమెంట్ ను నమ్ముతూ వారి వారి పనుల్లో విజయం సాధిస్తూ ఉంటారు. ఆ విధంగా టీమిండియా మాజీ కెప్టెన్ భారత క్రికెట్ జట్టు సత్తా ప్రపంచానికి చాటి చెప్పి తిరుగులేని శక్తిగా మార్చిన ఆటగాడు ధోనీ న్యూమరాలజీ అనే నమ్మకాన్ని నమ్మేవాడు. సంఖ్యా శాస్త్రాన్ని బాగా నమ్ముతాడు అని గతంలో చాలా సార్లు రుజువు అయ్యింది. ఆయన జెర్సీ పై ఉండే లక్కీ నెంబర్ 7. 

ఇక ఆగస్టు 15న తన ఇంస్టాగ్రామ్ లో 19:29 సమయం లో ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించాడు. సాధారణంగా ఇండియాలో 12 గంటల సమయాన్ని ఫాలో అవుతారు జనాలు. కానీ ధోని మాత్రం 19:29 అని ప్రకటించాడు. ఆయన ఇలా చేయడానికి కారణం లేకపోలేదట. ధోని ప్రకటించిన నెంబర్ 19, 29 ఏంజెల్ నెంబర్. తాను ఈ నెంబర్ ఉన్న సమయంలో రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక అసలు విషయం ఓ వ్యక్తి తన మనస్ఫూర్తిగా అత్యంత నిబద్ధతతో పని పూర్తి చేశాడని అర్థం. తను చేసిన పని పట్ల సంపూర్ణ సంతోషంతో ఉన్నట్లు భావన. నిజంగా ధోని రైల్వే ఎంప్లాయ్ గా మొదలు పెట్టిన తన జీవితాన్ని ఇలా గొప్ప ఆటగాడిగా ఎన్నో గొప్ప గొప్ప రికార్డును సాధించాడు. భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎలాంటి పాత్ర పోషిస్తాడు చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: