
ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు హీరోలు ఒకే మంత్రం జపిస్తున్నారు. అదే పాన్ ఇండియా సినిమా. ప్రతి ఒక్క హీరో కూడా ఈ తరహా లోనే సినిమాలు చేయాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో కొంత ఇమేజ్ వున్న ప్రతి హీరో కూడా ఈ విధంగా సినిమా చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని చూస్తున్నాడు. బాహుబలి సినిమా తో ప్రభాస్ ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తమ మార్కెట్ దేశవ్యాప్తంగా పెంచుకోవాలని చూస్తున్నారు.
హీరోలు తమ మార్కెట్ ను అంచలంచలుగా పెంచుకోవాలన్న ఆలోచన బాగానే ఉంది కానీ వారు టాలీవుడ్ దర్శకులను పట్టించుకోకపోవడం టాలీవుడ్ లోని కొంతమంది దర్శకులకు ఏమాత్రం నచ్చడం లేదట. దాంతో వారు ఇతర భాషల హీరోలు కి వలస వెళుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో కోలీవుడ్ హీరో లైనా విజయ్ దళపతి, ధనుష్ లు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ఈ ఇద్దరు హీరోలను మెప్పించిన దర్శకులు తెలుగు హీరోలను ఎందుకు మెప్పించలేకపోయారు అనే ప్రశ్న ఉత్పన్నం అయిన నేపథ్యంలో వారు మన తెలుగు హీరోలకు కథలు చెప్పడానికి ప్రయత్నించగా వారు వీరి నీ పాన్ ఇండియా సినిమా మోజులో వారిని పట్టించుకోవడం లేదట. దాంతో దర్శకులు వేరే భాషల హీరోలకు సినిమాలు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఇంకెంత మంది టాలీవుడ్ దర్శకులు పరభాషా హీరోలతో చిత్రాలు చేస్తారో చూడాలి. ప్రభాస్ బాలీవుడ్, కన్నడ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా కన్నడ దర్శకుడు తోనే సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఓ తమిళ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మన తెలుగు దర్శకులకు ఆదరణ కరువై ఇతర భాషల హీరోలకు వెళుతున్నారు.