
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు హిట్ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకి తమన్ సంగీతం హలైట్ గా నిలువనుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలో టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఈ మధ్య మహేష్ బాబు కథల విషయంలో వాటి ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో సినిమా కథలను రిజెక్ట్ చేసి మరి పరశురామ్ చెప్పిన ఈ సినిమా ను ఓకే చేశారు. దాంతో ఈ సినిమా ఎంతో స్పెషల్ గా ఉంటుందని మహేష్ బాబు అభిమానులు అనుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం తాను ఇంత వరకు చేయని ఒక సాహసాన్ని చేయబోతున్నారట మహేష్.
ఆయన ఇన్ని సంవత్సరాల కెరియర్ లో ఇంత వరకు వైజాగ్ ప్రాంతంలో షూటింగ్ చేయలేదు. సెంటిమెంట్ ఏమో అక్కడ సినిమా షూటింగ్ చేయడమే ఆయనకు ఇష్టం లేదు. అలాంటిది ఇప్పుడు వైజాగ్ లో షూటింగ్ చేయనున్నారట. సర్కారు వారి పాట తర్వాత షెడ్యూల్ విదేశాల్లో జరగాల్సి ఉండగా అక్కడికి షూటింగ్ లకు అనుమతించకపోవడంతో వైజాగ్ లో షూట్ చేయాలని నిర్ణయించారు. అక్కడే ఈ షెడ్యుల్ పూర్తి చేయాల్సి అవసరం వచ్చిందట. విశాఖలో పరశురామ్ హీరో హీరోయిన్ లపై పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు అని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో విశాఖ సెంటిమెంటును సూపర్ స్టార్ బ్రేక్ చేస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ ను కాదని చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.