ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`లో నటిస్తోన్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా కొరటాల శివ అన్ని పనులు పూర్తి చేసి ఆచార్య సినిమాని వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వున్న కరోనా పరిస్థితుల్లో అది వీలు పడుతుందా?  లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టపడి చేస్తున్నాడు.ఇక ఆచార్య సినిమా షూటింగ్ పూర్తికాగానే లూసిఫర్ చిత్రాన్నే ముందుగా పట్టాలెక్కించాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవితో తరువాత మూవీ కోసం డైరెక్టర్ బాబి కూడా ఎదురు చూస్తున్నారు. 

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి స్క్రిప్ట్ వినిపించి లాక్ కూడా చేసారు.ఇక మిగిలిన పనులు కూడా పూర్తి చేసి బాబి వెయిట్ చేస్తున్నాడు .ఇక  ఈ నేపథ్యంలో లూసిఫర్ రీమేక్ తో పాటు ఒకేసారి సెట్స్ కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు మరోవైపు ప్రచారం జరుగుతుంది.ఇక ఈ క్రమంలో బాబి మరోసారి నేను వెయిటింగ్ అంటూ చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి మంచి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని ఓ అభిమానిగా డైరెక్ట్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల్లో నటించినా ఆయనలో ఉత్సాహం మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గడం లేదు.ఇక ఈ సినిమా పక్క మాస్ కంటెంట్ తో మెగాస్టార్ అభిమానులు ఎంజాయ్ చేసేలా ఉంటుందట.ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమట.ఇక చూడాలి బాబి మెగాస్టార్ సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తాడో...

మరింత సమాచారం తెలుసుకోండి: