సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిధి మూవీ 2007 లో విడుదలై ప్రేక్షకులను ఎంతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన గా ఆ అంచనాలు అందుకోలేకపోయాడు సురేందర్.  మహేష్ బాబు కూడా పూర్తిగా సురేందర్ రెడ్డి మీద నమ్మకంతో ఈ సినిమా చేయగా ఆయన సినిమాను సరిగ్గా తెరకెక్కించలేక ఫ్లాప్ గా మలిచాడు. ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన మహేష్ మరో మూడు సంవత్సరాల దాకా ఇంకో సినిమా చేయలేదు.

అప్పటికే పోకిరి సినిమాతో సూపర్ స్టార్ హోదా అందుకున్న మహేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్ అమృతారావు హీరోయిన్ గా బాలీవుడ్ ప్రొడక్షన్స్ యూ టీవీ భాగస్వామ్యం కావడం వంటి వివిధ కారణాలతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవగా 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 712 థియేటర్లలో విజయదశమి శుభాకాంక్షలతో రిలీజ్ అయింది. మరీ అన్ని విశేషాలు ఉండేసరికి ఈ సినిమా కి దిష్టి తాకిందో ఏమో ఫ్యాన్స్ అంచనాలను సైతం అండుకోక మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.

సినిమా యొక్క మొదటి భాగం బాగా ఉండటంతో ప్రేక్షకులు మహేష్ కెరీర్ లో మరొక సూపర్ హిట్ వచ్చింది అని అనుకున్నారు కానీ సెకండాఫ్ చూశాక ఈ సినిమా యావరేజ్ హిట్ గా కూడా నిలవదని డిసైడయ్యారు. మహేష్ హెయిర్ స్టైల్ ఈ సినిమా లో బాగా అలరించింది. సురేందర్ టెక్నిక్ , మణిశర్మ సంగీతం అన్ని సూపర్ గా ఉన్నాయి అయితే కమర్షియల్ గా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది పెట్టిన పెట్టుబడి మాత్రం రాబట్టింది కానీ ఈ సినిమా నైతికంగా ఫ్లాప్ అయ్యింది. మూడు గంటల పాటు ఈ సినిమా సాగడం పెద్ద మైనస్ కాగా సెకండాఫ్ మరీ దారుణం గా ఉండడంతో సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో ముఖ్యంగా కామెడీ మిస్ అవడం, క్లైమాక్స్ లో చిన్న పాప చనిపోవడం, సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేక పోవడం, హీరోయిన్ సరిగా కరెక్ట్ గ కాకపోవడం వంటివి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: