
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న మూడో సినిమా అఖండ. గతంలో వీరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు రాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిలాగానే ఈ సినిమాతో హిట్ కొట్టి తమ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఇద్దరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు వైవిధ్యభరితమైన పాత్రలు ఉన్న కథను బోయపాటి శ్రీను తనదైన స్టైల్ లో డీల్ చేశాడు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించిన రెండు టీజర్లు రాగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈ విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా హిట్ ఎంతో అవసరం.
ఈ సినిమాతో హిట్ కొట్టి బాలకృష్ణ మళ్లీ ఫామ్ లోకి రావాలి అనుకుంటున్న సమయంలో బాలకృష్ణ ఇన్ని రోజు లు వెయిట్ చేసి సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడం ఎంతో కొంత సాహసం చేస్తున్నారని చెప్పవచ్చు. ఆ నెలలోనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశ జరుగుతుండగా సెప్టెంబర్ వరకు ఈ సినిమా మా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ సినిమా ఈ మేరకు నిలబెడుతుందో చూడా లి.