శంకర్ కూడా భారతీయుడు -2 సినిమా వివాదంలో ఉండడంతో దానిని ఆపివేసి రాంచరణ్ తో సినిమాను అనౌన్స్ చేసాడు. కానీ కోర్ట్ సూచనలు మేరకు భారతీయుడు -2 మూవీని పూర్తి చేయాల్సి వచ్చింది. తాజాగా రాంచరణ్, శంకర్ సినిమా గురించి ఒక వైరల్ న్యూస్ చక్కెర్లు కొడుతోంది. అది ఏమిటంటే ఈ సినిమా బడ్జెట్ సుమారు 200 కోట్లకు పైగా ఉండబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. రీసెంట్ గా రాంచరణ్ శంకర్ గారిని కలవడం జరిగింది. ఈ సినిమా గురించి చాలా విషయాలు ఆగష్టు లో అధికారికంగా తెలియజేయడం జరుగుతుంది అని రాంచరణ్ పేర్కొనడం జరిగింది. రాంచరణ్ ఇప్పటికే rrr షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్,అలియాభట్ పై ఒక పాట చిత్రికరణ జరుగుతుంది. రెండు పాటలు మినహా మిగిలినా టాకి పార్ట్ పూర్తి అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రాంచరణ్ కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న "ఆచార్య " సినిమా లో ఒక మఖ్య మైన పాత్రలో నటిస్తున్న రాంచరణ్ ఈ సినిమాలో 30 నిముషాలకు పైగా కనిపించునున్నాడట. శంకర్ భారతీయుడు-2 చిత్రం పూర్తి అవగానే రాంచరణ్ సినిమా మొదకు పెట్టె అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి