
అలనాటి నటి సౌందర్య నటిగా ఎన్నో శిఖరాలను అధిరోహించి గొప్ప నటిగా పేరు గాంచింది. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఈమె. నిన్నటి తరం యువతకు కలల రాణి గా ఉన్న సౌందర్య సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ లో సైతం కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. 1993లో మనవరాలి పెళ్లి అనే సినిమా లో సౌందర్య నటిగా పరిచయం అయినా విడుదలైన చిత్రం రైతుభారతం అనే విషయం అందరికీ తెలిసిందే. .
రచయిత త్రిపురనేని మహారధి కుమారుడు ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1994 లో విడుదలైంది. 92 మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించగా సౌందర్య మొట్ట మొదటి గా సీన్స్ ను భానుచందర్ కాంబినేషన్ లో చేయాల్సి వచ్చింది. మొదటిరోజు రొమాంటిక్ సీన్ పెట్టడంతో కొన్ని సీన్లు కాగానే సౌందర్య అసలు నాకు యాక్టింగ్ రావడం లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ గోల చేసిందట. ఆ మాటలు వినగానే దర్శకుడు తల పట్టుకున్నంత పనిచేశారట. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా అంటుంది అని బాధపడ్డారు. ఎలాగైనా సౌందర్య చేయాలని ఆమెను ట్రై చేశారట.
రచయిత మహారధి కూడా ఎంత చెప్పినా సౌందర్య వినలేదట. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించమని సౌందర్య తండ్రి సత్యనారాయణ సైతం ఆమెను ఒప్పించలేకపోయారట. దాంతో దర్శకుడు సౌందర్య ను ఫ్యామిలీ వాతావరణం లోకి తీసుకెళ్లి మూడ్ క్రియేట్ చేయాలని భావించగా అందుకోసం తన ఇంటి నుంచి భార్య పిల్లలను పిలిచారట. అప్పుడు ఫ్యామిలీ వాతావరణంలోకి సౌందర్య వచ్చిందట. యాక్టింగ్ అంటే ఇంతే అని కుటుంబానికి నటనకు పెద్దగా తేడా లేదని చెప్పి సౌందర్య చేత ఆ సినిమా పూర్తి చేయించారట. 94 లో విడుదల అయిన ఈ చిత్రానికి సౌందర్య కు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి గొప్ప నటిగా ఎదిగింది. ఓ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది సౌందర్య.