ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా వాళ్ళు ఆయన గురించి ఎన్నో స్టోరీలు రాసుకోగా ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచారు. అప్పట్లో దావూద్ ఇబ్రహీం ప్రముఖ సినీ హీరోయిన్ మందాకిని తో ఎఫైర్ ఒక హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నటి అయిన మందాకిని చాలా భాషలలో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం సినిమాలో ఓ పాత్రలో నటించి మేప్పించారు. ఆ తరువాత భార్గవ రాముడు అనే కుటుంబ కథా చిత్రంతో ఆకట్టుకున్నారు.

చేసిన రెండు సినిమాలు టాలీవుడ్ లో సూపర్ హిట్ గా మారడంతో ఇక్కడ కూడా బిజీ అయ్యారు మందాకిని.  కొన్నేళ్లపాటు దక్షిణాదిన ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా బిజీ అయి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆమె కెరియర్ మైల్ స్టోన్ మూవీ గా రామ్ తేరీ గంగా మైలీ అనే చిత్రాన్ని చెప్పుకోవచ్చు. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె దావుద్ తో అఫైర్ సంచలనం గా మారింది.  దాని వల్ల ఆమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఆమె దావూద్ ఇబ్రహీం సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం బాగా జరిగింది. అంతే కాదు దుబాయ్ లో రహస్యంగా కాపురం కూడా పెట్టినట్లు ప్రచారం జరిగింది.

వారి అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ కావడంతో ఈమే సినిమా పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపటం లేదని వెలుగులోకి వచ్చింది. అలా క్రమక్రమంగా తన కెరీర్ కు ముగింపు పలికింది. 57 సంవత్సరాల మందాకిని ఇప్పుడు బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి రెడీ అయినట్లు బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమె సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు.  ఆర్థికంగా బాగా స్థిరపడడంతో ఆమె స్వీయ నిర్మాణం చేపట్టిన ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. మరి ఈ రీ ఎంట్రీ లో మందాకినీ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: