
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. దానికి తోడు బాలీవుడ్ లో కూడా ఆయన ఎంట్రీ ఇవ్వనుండడంతో అక్కినేని నాగ చైతన్య కెరియర్ మరో స్టేజ్ కి వెళ్ళింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాగా సినిమాపై అంచనాలను ఈ పాటలు పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే అక్కినేని నాగచైతన్య ఈ సినిమాతో పాటు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యూ అనే సినిమాను చేశాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వెరైటీ సినిమా గా మనం రాగా అది సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎంతో వైవిధ్య భరితమైన చిత్రం అవుతుంది అని అంటున్నారు.
అలాగే బాలీవుడ్ చిత్రమైన అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా అనే భారీ బడ్జెట్ మూవీ లో కూడా నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలే కాకుండా తన తదుపరి చిత్రాల విషయాలలో కూడా నాగచైతన్య ఎంతో క్లియర్ గా ఉన్నాడు. తరుణ్ భాస్కర్ కథకి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు నాగ చైతన్య. ఇలా లవ్ స్టోరీ సినిమా తో కలిపి మొత్తం ఐదు సినిమా రంగంలో ఉంచాడు నాగచైతన్య. ఈ నేపథ్యంలో ఈయనకు ఏ సినిమా ఏ విధమైన పేరు ను తీసుకు వస్తాయో చూడాలి. ఇక అక్కినేని సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య ఆమెతో కలిసి నటించాలని ఆశపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. మచిలీ తర్వాత వీరి కాంబినేషన్ ఇప్పటివరకు ఇరానీ నపథ్యంలో ఎప్పుడు తెరకెక్కుతుంది చూడాలి.