
సౌత్ సినీ పరిశ్రమ లో ప్రతీ మాస్ సినిమాలో ఐటెం సాంగ్ తప్పకుండా ఉండాల్సిందే. దానికోసం సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది అంటే ఐటం సాంగుకు సౌత్ సినిమాలలో ఏ రేంజిలో డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ లో పెద్ద సినిమా వచ్చిందంటే చాలు తప్పకుండా అందులో ఐటెంసాంగ్ ఉండాల్సిందే. పెద్ద పెద్ద హీరోయిన్ లు కూడా ఐటెం సాంగులు చేస్తూ ఉంటారు. మన దర్శక నిర్మాతలు వారిని ఒప్పించి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఐటెం సాంగ్ లు చేస్తారు. ఆ విధంగా కాజల్, హన్సిక, అంజలి, తమన్నా, శృతి హాసన్ లాంటి హీరోయిన్ లు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే, పెద్ద సినిమాలు చేస్తున్న సమయంలోనే ఐటం సాంగులు చేసి ప్రేక్షకులను అలరించారు.
వీరు మాత్రమే కాకుండా కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే చేసే కొంతమంది నటీమణులు ఉన్నారు. అప్పట్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని సిల్క్ స్మిత లాగా ఇప్పుడు ముమైత్ ఖాన్, హంసానందిని లాంటి నటీమణులు ఐటెం సాంగ్ లో కుదిరితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా చేస్తారు. సినిమా వైట్ ను పెంచే ఐటెం సాంగ్ లలో వీరికి ఎంత పారితోషికం ఎంత ఇస్తారు అనే విషయం చాలామందికి డౌట్. సినిమా మొత్తం చేసే రెమ్యునరేషన్ ఒక పాటకి వస్తుండటంతో స్టార్ హీరోయిన్లు సైతం దీనిపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి ఐటమ్ సాంగ్స్ లో నటించే వీరు ఎంత పారితోషకం అందుకుంటారో చూద్దామా.
పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా హెబ్బా పటేల్ రెడ్ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ కి గాను ఆమె 15 లక్షల పారితోషికం అందుకుందట. బిగ్ బాస్ షో ద్వారా మంచి ఫేమ్ దక్కించుకున్న మోనాల్ అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయగా దానికి 13 లక్షల పారితోషకం అందుకుంది. యాంకర్ అనసూయ తెరమీద ఐటమ్ సాంగ్ లో తన అందాలను వెదజల్లిన కారణంగా అందుకుగాను 20 లక్షల పారితోషికం అందుకుందట. క్రాక్ సినిమా లో అందాల విందు చేసిన అప్సర రాణి 9 లక్షల రూపాయలు అందుకోగా, కాజల్, తమన్నా, శృతిహాసన్ వంటి స్టార్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ లు 50 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారట.