టాలీవుడ్ లో మెగా
ఫోన్ పట్టుకొని యాక్షన్ అనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దర్శకుడిగా రాణించాలనుకునే వారికి కాకుండా నటీనటులకు, ఇతర విభాగాల్లో పని చేసే వారికి కూడా ఈ కోరిక ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతోమంది నటీనటులు దర్శకత్వం చేయగా కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లు కూడా
డైరెక్టర్ కుర్చీలో కూర్చున్నారు. కొంతమంది ఈ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ కంటిన్యూ చేయగా ఇంకొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే ఉత్తమ దర్శకత్వం ఆపేశారు.
కమెడియన్లు గా తెలుగు తెరకు పరిచయం అయిన వారు కూడా సినిమాకి దర్శకత్వం చేసి
సక్సెస్ అవగా వారిలో
కమెడియన్ వెన్నెల కిషోర్ ఒకరు. గతంలో దర్శకత్వం చేయగా ఇప్పుడు మరొకసారి దర్శకత్వం చేయడానికి సిద్ధమవుతున్నాడు.
వెన్నెల సినిమాతో
కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకుని
వెన్నెల కిషోర్ గా మారి ఎన్నో పెద్ద సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. తనకే సాధ్యమైన టైమింగ్ తో కామెడీతో ప్రేక్షకులను ఎంతో మెప్పించిన ఈయనలో దర్శకుడు కూడా దాగి ఉన్నాడు అని తెలియడానికి ఎన్ని రోజులు పట్టలేదు.
వెన్నెల 1 1/2, జఫ్ఫా సినిమాలను డైరెక్ట్ చేసి
వెన్నెల కిషోర్ దర్శకుడిగా మారగా ఆయా సినిమాల ఫలితాలు అంతగా లేకపోవడం తో మళ్ళీ దర్శకత్వం జోలికి వెళ్ళలేదు.
కమెడియన్ గా స్థిరపడాలని వరుసగా
కామెడీ రోల్స్ చేసుకుంటూ వచ్చి స్టార్
కమెడియన్ గా ఎదిగాడు.
వెన్నెల కిషోర్ కమెడియన్ గా చేస్తున్న టైం లో
సునీల్ హీరోగా వెళ్లిపోవడంతో
వెన్నెల కిషోర్ కి కలిసి వచ్చి
సునీల్ చేయాల్సిన పాత్రలు అన్ని ఈయనకు వచ్చాయని చెబుతూ ఉంటారు. తాజాగా
వెన్నెల కిషోర్ మరొకసారి మెగాఫోన్ పట్టబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సారి సినిమాకి కాకుండా వెబ్ సీరీస్ డైరెక్ట్ చేయబోతున్నాడట.
అల్లు అరవింద్ ఆహా కోసం ఈ వెబ్ సిరీస్ చేయబోతున్నాడని తెలుస్తోంది. దీనిద్వారా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వనున్నాడట. మరి ఈ ప్రయత్నం ఆయనకు ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.