హీరో భానుచందర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. డూప్ లేకుండా సొంతంగా ఫైట్ చేసే అతి కొద్దిమంది తెలుగు హీరోలలో భానుచందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కెరీర్ తొలినాళ్లలో హీరోగా అనేక సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి వారిని అభిమానులుగా మార్చుకున్నాడు.  ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భానుచందర్ తెలుగులో మన ఊరి కౌరవులు చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం , నిరీక్షణ వంటి హిట్ చిత్రాలను చేసి నటుడి గా నిలదొక్కుకున్నారు.

ఆయన చేసిన నిరీక్షణ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. టాలీవుడ్ లో ఎంతో మంది పెద్ద పెద్ద దర్శకులతో నిర్మాతలతో పనిచేసిన ఆయన సింధూరం , దేవి, సింహాద్రి  స్టైల్ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించి తాను అన్ని రకాల సినిమాలు చేయగల నటుడు అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం హీరోగా చాలా తక్కువ సినిమాలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన విశ్వక్ కథానాయకుడిగా నటించిన హిట్ సినిమాలో  కీలక పాత్రలో నటించారు. 

తెలుగులోనే కాకుండా తమిళ భాషలో సైతం ఆయనకు మంచి గుర్తింపు ఉంది. టీవీ సీరియల్స్ లో  సైతం నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు భానుచందర్. ఇక ఆయన పర్సనల్ జీవితం విషయానికి వస్తే ఈయనకు కొడుకు కూడా సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు. తమిళంలో ఇప్పుడిప్పుడే హీరోగా సినిమాలు చేస్తూ నటుడుగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జయంత్ కథానాయకుడిగా భానుచందర్ దర్శకత్వం వహించిన నా కొడుకు బంగారం సినిమా గతంలో చేయగా ఆ సినిమా కొంత వరకే మెప్పించింది. ఆ తర్వాత జయంత్ ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: