టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుపాటి రానా , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లీడర్' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో లో క్లాస్ అండ్ డీసెంట్ పొలిటికల్ లీడర్ గా హీరో చేసిన నటనకు జనాల నుండి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత హీరో గా చాలా సినిమాలలో నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాహీరో కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలో విలన్ గా నటించి 'పాన్ ఇండియా' రేంజ్ లో క్రేజ్ ని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడు.


 మరొక అడుగు ముందుకేసి  భారత్, శ్రీలంక మ్యాచ్ దగ్గర నుంచి టోక్యో 2021 , రెజ్లింగ్‌ ,ఒలంపిక్స్‌ ను తెలుగు ప్రజలకు పరిచయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. అందుకోసం ప్రముఖ టీవీ ఛానల్ అయిన 'సోనీ' సంస్థతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఒక మీడియా తో ముచ్చటించిన, రానా తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపాడు. తెలుగు భాష లోతుగా నేర్చుకుంటే అందులోని మాధుర్యం తెలుస్తుంది. 'నారప్ప' సినిమా 'ఓ టి టి' లో విడుదల కావడం చాలా బాధగా ఉంది అని , పెళ్లి తర్వాత జీవితం చాలా మారిపోయింది .


 త్వరలోనే  వెంకటేష్ బాబాయ్ , తమ్ముడు అభిరామ్ తో  కలిసి  ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తానని చెప్పాడు. రానా హీరోగా నటించిన 'విరాట పర్వం' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని  కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమాలో  సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. వీటితో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: