టాలీవుడ్ లో సూర్యం
సినిమా ద్వారా పరిచయమైన
హీరోయిన్ సెలీనా జైట్లీ. అంతకుముందు హిందీలో రెండు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని సూర్యం
సినిమా లో
హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో
సినిమా చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. కానీ హిందీలో సినిమాలు చేసుకుంటూ వచ్చి అక్కడ అందాలతారగా ఎదిగింది. ఇండస్ట్రీలోకి ఎంతో మంది
హీరోయిన్ వచ్చినా వారు సరైన సినిమాల ఎంపిక చేసుకోలేక
సినిమా ఇండస్ట్రీకి అతి తక్కువ సమయంలో నే దూరమై పోతారు.
అయితే హీరోయిన్స్ గా వారు సత్తా చాటలేకపోయినప్పటికీ వారి వైవాహిక జీవితంలో మాత్రం సంతోషంగా జీవితం సాగిస్తూ ఉంటారు. అలా కొన్నాళ్ళు విరామం తీసుకుని మళ్ళీ సినిమాల్లోకి అడుగుపెట్టి
సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటారు. ఆ విధంగా
సెలీనా జైట్లీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టుకోవాలని ఆశపడుతుంది. ఒక్క సినిమాతోనే
టాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన ఈమె
తమిళ కన్నడ మలయాళం
హిందీ భాషలలో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అయితే ఆమెకు సరైన హిట్స్ పడకపోవడంతో ఆమె
సినిమా పరిశ్రమకు దూరమైపోయింది. దానికి తోడు ఓ
టాలీవుడ్ హీరో తో ప్రేమలో మునిగితేలిన ఈమె అతనీ ఎడబాటుతో ఎంతో కృంగి పోయిందట. ఆ
హీరో తండ్రి బాగా హెచ్చరించడంతో ఆమె సినిమాలు మానేసి తన స్వస్థలం వెళ్లిపోయిందట. ఆ తర్వాత ఈమె పీటర్ హాగ్ అనే వ్యక్తిని ప్రేమించి 2011లో
పెళ్లి చేసుకుంది. అయితే
పెళ్లి తర్వాత ఆమె చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమై భర్తకు బిజినెస్ రంగంలో ల్ప్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తన రీ ఎంట్రీ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఓ షార్ట్ ఫిలిం చేస్తోందని చెబుతున్నారు. ఓ టీ టీ ప్లాట్ ఫామ్ మీద
సినిమా నీ విడుదల చేస్తారట.