తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారులు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది ప్రముఖులు, సినీ నటులు, మరియు రాజకీయ నాయకులు ఇలా చాలా మంది  పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కొంతమంది కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలుపగా మరికొందరు తమ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జాతిరత్నం సినిమాతో మంచి విజయం సాధించిన నవీన్ పొలిశెట్టి కూడా మంత్రి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతూ" హ్యాపీ బర్త్ డే  రియల్ తెలంగాణ జాతిరత్నం మంత్రి కేటీఆర్ గారు.. కరోనా మహమ్మారి సమయంలోనూ మీరు చేసిన సేవలు చాలా గొప్ప వైనవి. వారికి ఈ సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి"అంటూ ట్వీట్ చేసాడు నవీన్ పోలిశెట్టి. అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ ను జాతి రత్నం అని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేయడంపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని కొందరు... కరోనా పేషెంట్లకు అసలు కేటీఆర్ ఏం చేశారు అని మరి కొందరు నవీన్ పోలిశెట్టి ట్వీట్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఇక మరికొందరేమో ప్లీజ్ ఇలా బూట్లు నాకొద్దని... ఇక మరికొందరు అయితే ఆపరా బాబు ఈ డబ్బా కొట్టడం అని... నవీన్ పోలిశెట్టి ట్వీట్ కు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు  నెటిజన్ల కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా మొన్నటి కరోనా టైమ్ లో వచ్చిన జాతి రత్నాలు సినిమా నవీన్ పోలిశెట్టి కి మంచి విజయాన్ని అంధించిన సంగతి తెలిసిందే. 




మరింత సమాచారం తెలుసుకోండి: