
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోల జోరు మామూలుగా లేదు. ఒకరిని మించి ఒకరు సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ స్టార్ హీరోల కు పోటీ ఇస్తున్నారు. గతంలోలా ఈ యంగ్ హీరోలు ఏమాత్రం సినిమాలను లైట్ తీసుకోవడం లేదు మంచి మంచి సబ్జెక్టు ఎంచుకొని స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని విధంగా వారు తమ సినిమాల ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని వారి అభిమానులుగా మార్చుకున్నారు.
ఇంకా కొంతమంది సినిమా చేయకముందే తమ యాటిట్యూడ్ తో ప్రేక్షకులను అభిమానులు గా మార్చుకుంటున్నారు. అలా హీరో సంతోష్ శోభన్ ఇటీవలే ఏక్ మినీ కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. సంపత్ నంది నిర్మించిన పేపర్ బాయ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన సంతోష్ శోభన్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో ఆయన తదుపరి చిత్రం అయిన ఏక్ మినీ కథ సినిమాను విడుదల చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు తన నటనతో అందరి లో మంచి మార్కులు కొట్టేశాడు.
ఈ సినిమా తో మినిమమ్ గ్యారంటీ హీరోగా ఎదిగిన సంతోష్ శోభన్ మరో సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో లాక్ డౌన్ టైం లో మంచి రోజులు వచ్చాయి అనే సినిమాను అతి తక్కువ టైమ్ లోనే పూర్తి చేశాడు సంతోష్ శోభన్. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. ఓ కాలనీలో జరిగే కథ గా మారుతి స్టైల్లో ఈ సినిమాను చేశాడు. అక్కడ కనిపించే రకరకాల పాత్రలు వాటి మధ్య పండించే వినోదం మధ్యలో కరోనా ఉన్న కారణంగా మనుషులు విడిపోవడం ఆ తర్వాత మళ్లీ కలవడం వంటి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిన ట్లు తెలుస్తోంది.