టాలీవుడ్ లో అక్కినేని వారి సినిమాలకు ఎంతో క్రేజ్ నెలకొని ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున, అక్కినేని నాగార్జున వారసులుగా అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా నిలదొక్కుకుని పలు హిట్ చిత్రాల్లో నటించగా ప్రస్తుతం క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్ ల తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. త్వరలోనే థియేటర్ లో ఓపెన్ అయ్యాక ఈ సినిమా థియేటర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. సాయిపల్లవి కథానాయకుడిగ నటించిన ఈ సినిమా లోని పాటలు ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ను తీసుకు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా అంచనాలను రెట్టింపు చేసుకుంది ఈ సినిమా. దీని తర్వాత నాగచైతన్య తనకు మనం లాంటి మరపురాని హిట్ ను అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే మరో విభిన్నమైన చిత్రాన్ని చేస్తున్నాడు.

ఈ చిత్రం కూడా సగభాగం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య ఓ ఓటీటీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. శరత్ మరార్ నిర్మించే ఈ సినిమా కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నాగచైతన్య నటించడమే తరువాయి అని చెప్పుకుంటున్నారు. అందరు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ ను ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే నాగచైతన్య మాత్రం ఇలా చిన్న హీరోలా ఓ టీ టీ సినిమా చేయడం ఏంటి అని అక్కినేని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో సినిమా చేయడం ఒకింత బాగానే ఉన్నా ఈ ఓ టీ టీ సినిమా చేయడం మాత్రం వారికి నచ్చడం లేదని తెలుస్తోది. 

మరింత సమాచారం తెలుసుకోండి: