ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరూ  పాన్ ఇండియా సినిమాల మేనియాలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు దేశంలోని ఇతర హీరోలకు పోటీగా వస్తుండడం టాలీవుడ్ కి మంచి పరిణామమే అయినా ఇప్పుడు ఈ పది రోజులకు సరికొత్త సమస్య ఏర్పడేలా ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా ఓపెన్ ఇండియా సినిమా ల ట్రెండ్ నీ  కొనసాగిస్తూ ఉండగా ఇప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఈ తరహా సినిమా లు చేస్తున్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా నీ పాన్ ఇండియా లెవెల్ లోకి చేస్తుండగా మరో వైపు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను అదే లెవెల్ లో చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా ప్రభాస్ రాధేశ్యామ్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, సలార్ వంటి సినిమాలను కూడా పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా లో వరుస సినిమాలు చేస్తూ ఉండగా ఇప్పుడు వారికి సరికొత్త సమస్య వచ్చి పడింది.

అదేమిటంటే పాన్ ఇండియా రేంజ్ లో మన హీరోలను చూపించగల దర్శకులు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో రాజమౌళి ప్రశాంత్ నీల్ ఉండగా మిగితా వారు ఎవరు ఈ తరహా సినిమాలు గతంలో ఎప్పుడూ చేయలేదు. వీరు కాకుండా మరే దర్శకుడు కూడా ఇప్పుడు ఉన్న పొజిషన్ లో ఆ రేంజ్ లో సబ్జెక్టు తీసుకురాలేరు. ఒకవేళ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేద్దామనుకున్నా దానికి తగ్గ దర్శకులు దొరకాలి.  అయితే ఇప్పుడు ఆ కొరత స్పష్టంగా తెలుస్తుంది.ఒక వేళ మన హీరోలు ఇప్పుడు చేస్తున్న సినిమాలు అయిపోతే మాత్రం మన హీరోలు పాన్ ఇండియా సినిమాల కోసం బాలీవుడ్ కి వెళ్ళాలి. మరి ఈ సమస్య నుంచి వీరు ఎలా అధిగమిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: