షకీలా తమిళ ఇండస్ట్రీ తో వెండితెరకు పరిచయమైన ఈ నటి అక్కడ మంచి విజయాలు అందుతున్న సమయంలోనే మలయాళం ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు రావడంతో కేరళ వైపు అడుగులు వేసింది. మలయాళంలో బి గ్రేడ్ సినిమాలకు పెట్టింది పేరుగా ఎదిగిన ఈ నటి, స్టార్ హీరోలకు సైతం దడ పుట్టించే కలెక్షన్లను బి గ్రేడ్ సినిమాలతో సాధించింది. ఇలా మలయాళ ఇండస్ట్రీ పై తీవ్ర ప్రభావం చూపిన ఈ నటి ఆ తర్వాత కాలంలో తెలుగులోనూ అనేక సినిమాలలో నటించింది .మరీ ముఖ్యంగా తేజ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలలో షకీలా ముఖ్య పాత్రలో కనిపించింది. కానీ ప్రస్తుతం ఈ నటి సినిమాల పరంగా కొంచెం స్లో అయిందని చెప్పవచ్చు.


ఈ మధ్య కాలంలో కూడా షకీలా పలు సినిమాలను నిర్మించి వాటిని థియేటర్లలో విడుదల చేయలేక డిజిటల్ గా విడుదల చేసింది. కానీ తాజాగా ఈ శృంగార తార షకీలా తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. నా మీద వస్తున్న ప్రచారాలు నమ్మకండి అని షకీలా పేర్కొంది. టీవీ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్న షకీలా గురించి ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది, ఆ వార్తే షకీలా మరణించింది అని. దీనితో తనపై సాంఘిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం గురించి దిగ్భ్రాంతికి గురైనట్లు ఒక వీడియోను చేసి విడుదల చేశారు. ఈ వీడియోలో తాను ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఇలాంటి వార్తలను ఎవరు నమ్మద్దు అని ఆమె ఈ వీడియో ద్వారా తెలిపింది. షకీలా మిలా అనే అమ్మాయి దత్తత తీసుకున్న విషయం మనకు తెలిసిందే. షకీలా తన దత్త పుత్రిక తో తీసుకున్న  ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. మీలా లేకపోతే నేను లేను, తనకు జీవితమే లేదు అని, తనకు తోడు నీడ మీలానే అని పేర్కొన్నారు. షకీలా తనపై వస్తున్న వదంతుల గురించి ఇలా స్పందించింది

మరింత సమాచారం తెలుసుకోండి: