సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఓ కన్నీటి గాధ ఉంటుంది. తమ కుటుంబాన్ని పోషించడం కోసం సినిమా వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎంత కష్టం వచ్చినా కుటుంబాన్ని సంతోషంగా ఉంచే వారు. తమకు ఎలాంటి కష్టం వచ్చినా తనలోనే దాచుకొని కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేవారు బహుశా సినిమా ఇండస్ట్రీ లోనే ఉంటారు కావచ్చు. ఆ విధంగా 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కట్టా సుబ్బారావు అనే దర్శకుడు తనకు క్యాన్సర్ ఉందన్న విషయాన్ని సొంత కుటుంబానికి కూడా చెప్పలేదు. చెబితే ఎక్కడ బాధపడతారో అన్న ఆ కారణంగా ఆయన చెప్పకుండా గొప్ప వ్యక్తిగా మారిపోయాడు.

కోనసీమలోని రాజోలు కు చెందిన ఆయన ఒకప్పటి ప్రసిద్ధ దర్శకులు ప్రత్యగాత్మ వద్ద 15 సంవత్సరాలు శిష్యరికం చేసి వియ్యాల వారి కయ్యాలు అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. కృష్ణ జయప్రద జంటగా నటించిన ఈ సినిమా తర్వాత ఆయన పదేళ్ళకాలంలో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, మొగుడు కావాలి, బంగారు బావ, శ్రీరస్తూ శుభమస్తూ, కొంటె మొగుడు పెంకి పెళ్ళాం, సీత పుట్టిన దేశం లాంటి ఎన్నో సూపర్ హిట్ అద్భుతమైన చిత్రాలను ఆయన దర్శకత్వంలో తెరకెక్కాయి. 

1988లో ఆయన మరణించే నాటికి ఆయన వయసు కేవలం 49 సంవత్సరాలు మాత్రమే. లుకేమియా తో బాధపడ్డాడు ఈ గొప్ప దర్శకుడు. ఇక్కడే విచారకరమైన విషయం ఏమిటంటే తనకు ఈ రకమైన క్యాన్సర్ ఉందన్న విషయం భార్యతో సహా కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వారికి అనుమానం రాకుండా మెడిసిన్స్ తీసుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొనీ గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించారు. ఆయనకు ఆ వ్యాధి ఉందన్న విషయం కుటుంబ సభ్యులకు చివరి దశలో తెలిసిందట. అప్పటికే ఆయనను క్యాన్సర్ దాదాపుగా కబలించేయడంతో కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఏమీ చేయలేకపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: