టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఏ హీరోకి లేదనే చెప్పాలి. పాన్ ఇండియా సినిమాల సంస్కృతి నీ టాలీవుడ్ కు తీసుకువచ్చిన ఘనత ఈయనదే. ఆయన హీరోగా నటించిన బాహుబలి సినిమా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగా నేషనల్ స్టార్ గా ప్రభాస్ ఎదిగిపోయాడు. ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెకుతున్న సినిమాలే.  హీరోగా ప్రభాస్ తదుపరి సినిమా రాధేశ్యామ్ రాబోతుండగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

 దీని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ లో ఎంట్రీ చేస్తున్న ఆది పురుష్ సినిమా కూడా లైన్ లోనే ఉంది. ఇక ప్రభాస్ కెరీర్ లోనే వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న  ప్రాజెక్టుకే సినిమా కూడా లైన్ లోనే ఉంది. ఇది పాన్ వరల్డ్ మూవీ అని అంటున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ లో ఆయనకు పోటీ ఇచ్చే హీరో ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ అని సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది.

వాస్తవానికి విజయ్ దేవరకొండ కూడా అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న లైగర్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో నే తెరకెక్కుతుంది. సోషల్ మీడియా లో క్రేజ్ ఈ ఇద్దరి స్టార్స్ కు బాగానే ఉంది.  ముఖ్యంగా ఇన్స్టా గ్రమ్ లో దక్షిణాది నుంచి ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన హీరోగా విజయ్ దేవరకొండ రికార్డు నెలకొల్పారు. ఫేస్ బుక్ లో ప్రభాస్ సౌత్ లో ఒకే ఒక్కడు గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సోషల్ మీడియా పరంగా కూడా ఈ ఇద్దరు హీరోలు ప్రేక్షకులలో ఎంతో హుషారు తీసుకొస్తున్నారు. మరి భవిష్యత్తులో వీరిద్దరు హీరోలు ఏ రేంజ్ సినిమాలు చేస్తారో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: