ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల విడుదలలు అన్ని సీజన్లకు బుక్ అయిపోయాయి అని చెప్పొచ్చు. దసరా సీజన్ కు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, ఆ తర్వాత క్రిస్మస్ సీజన్ కు పుష్ప, కేజీఎఫ్, ఆ తర్వాత సంక్రాంతి సీజన్ కు రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్, వెంకటేష్ F3, మహేష్ బాబు సర్కార్ వారి పాట వంటి సినిమాలు ఇప్పటికే అధికారికంగా విడుదల తేదీల ను కూడా ప్రకటించేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో రెండు క్రేజీ చిత్రాల విడుదలలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా విడుదల అవ్వడం కొంత ప్రశ్నార్థకంగా మారింది. భారీ బడ్జెట్ సినిమాతో రామ్ చరణ్ నటిస్తూ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా ట్రైలర్ టీజర్ లతో ఈ సినిమా భారీ అంచనాలను నెలకొనేలా చేసింది.  భారీగా కలెక్షన్లు వసూలు చేసే సెలవు సీజన్ లు ఇప్పుడు ఆచార్య సినిమా విడుదల చేస్తే ఇబ్బంది కలుగుతుంది అని చిత్ర బృందం భావిస్తోందట.


మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా కూడా విడుదల ఆగిపోయింది. దీనిని ఎక్కడ ఎప్పుడు ఎలా విడుదల చేయాలనే ఆలోచనలో బాలకృష్ణ పడ్డాడట. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల విడుదలలు ఎక్కడ ఇరికించాలని టాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. భారీ అంచనాలు నెలకొన్న ఈ రెండు సినిమాలు దీపావళి క్రిస్మస్ కు రావాలని ముందునుంచి భావించగా అప్పుడు పుష్ప సినిమా రావడం తో క్లాష్ అవ్వడం ఇష్టం లేక సమ్మర్ కు వెళ్లే ఆలోచనలో ఈ చిత్ర బృందాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు సమ్మర్ కి వెళితే అప్పటికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: