ప్రముఖ వ్యాపారవేత్త
రాజ్ కుంద్రా
పోర్నోగ్రఫీ వ్యవహారంలో ఇటీవలే అరెస్టయిన సంగతి తెలిసిందే. వ్యాపార వేత్త అనే ముసుగులో చాలా మందిని మోసం చేశాడని ఎంతోమంది ఆయన వల్ల ఇబ్బంది పడ్డారని అనేక ఆరోపణలు రాగా పోర్నో గ్రఫీ వ్యవహారంలో ఆయనను అరెస్టు చేశారు పోలీసులు. ఈ వ్యవహారం గత పది రోజుల నుంచి
బాలీవుడ్ లో జరుగుతున్న కూడా సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉంది.
రాజ్ కుంద్రా
భార్య శిల్పాశెట్టి ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
మోసాలకు నేరాలకు పాల్పడుతున్న సమయంలో శిల్పాశెట్టి ఏం చేస్తుంది అని ఆమెపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. శిల్ప శెట్టి హస్తం కూడా ఉంది కాబట్టి ఆయనను ఏమనకుండా ఉంది అని అనేక కథనాలు కూడా వస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా ఆమె సినిమాల్లో నటించి పెంచుకుంటూ వచ్చిన ఇమేజ్ ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలినట్లు అయ్యింది. మరోవైపు శిల్పాశెట్టి తనపై వస్తున్న
మీడియా కథనాలను ఆపాలంటూ కోర్టుకెక్కింది. కోర్టులో కూడా ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మీడియాకు పదే పదే విజ్ఞప్తి చేసినా ఆమె పై తప్పుడు వార్తలు కథనాలు ప్రచురితం కావటం ఆగలేదు.
అయితే మీడియాలో వస్తున్న కథనాలకు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు వ్యతిరేకంగా సెలబ్రిటీలు ఆమెకు మద్దతు గా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పటికే సౌత్ స్టార్
హీరో మాధవన్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. నీవు శక్తివంతమైనదానువని కచ్చితంగా నీకు దేవుడు
శక్తి ఇస్తాడు అని ఆశిస్తున్నాను అన్నాడు. ఆయనే కాకుండా ఇంకా కొంత మంది
బాలీవుడ్ ప్రముఖులు మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ తమదైన శైలిలో శిల్పాశెట్టికి మద్దతుగా నిలిచారు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు కొంత మంది సామాన్యులు ఇతర రంగాల్లోని ప్రముఖులు కూడా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఎంత తప్పు చేసినా ఆమె కూడా ఓ మహిళ అని గుర్తు చేస్తున్నారు.