టాలీవుడ్ లో గత రెండు వారాలుగా విడుదల అవుతున్న సినిమాలను చూసి పెద్ద సినిమాల నిర్మాతల లో భయం పుట్టిందో ఏమో వారు తమ సినిమాలను థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా తమ సినిమాలను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని కొందరు నిర్మాతలు పట్టుదలగా ఉండగా ఇప్పుడు ఆ పట్టు సడలిపోతుంది ఎందుకంటే గత రెండు వారాలుగా కొన్ని సినిమాలు విడుదల కాగా ఆ సినిమాలను ఏవిధంగా నూ ప్రేక్షకులు ఆదరించలేదు.
దాంతో సదరు సినిమాల నిర్మాతలు భారీ నష్టాలు చవి చూశారు. ఆ
సినిమా లు
థియేటర్ లలో ప్రేక్షకుల కోసం బిక్కు బిక్కు మంటూ ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ సినిమాల్లో కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాయేమో అన్న భయంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఓ టీ టీ వైపు చూస్తున్నారు.
నాని హీరోగా నటించిన టక్ జగదీష్, అలాగే
శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనీ
లవ్ స్టోరీ సినిమా దగ్గుబాటి రానా నటించిన విరాటపర్వం గోపీచంద్ హీరోగా నటించిన సీటి మార్ సినిమాలు అన్ని ఇప్పుడు ఓ టీ టీ లో విడుదల అవడానికి పోటీ పడుతున్నాయి.
దీనంతటికీ కారణం రెండవ వారంలో విడుదలైన సినిమాలే అని తెలుస్తుంది. థియేటర్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే రెండో వారమైన విడుదలైన సినిమాలకు ప్రేక్షకులు వచ్చి ఉండాలి కానీ వారికి ఆ ఉద్దేశం లేనట్టుగా అనిపించడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదా ఈ విధమైన ఆలోచన చేస్తున్నారు. ఒక పెద్ద
సినిమా థియేటర్ల లోకి వచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తే తప్పా వారు థియేటర్లకు వచ్చేలా లేరు సో ఓ పెద్ద
సినిమా విడుదల అయిన తర్వాత తమ సినిమాలను విడుదల చేయడం ప్రమాదకరం కాబట్టి వారు ఈసారి ఓ టీ టీ తో కానిచ్చేస్తున్నారు.