మెగాస్టార్ తమ్ముడిగా
సినిమా పరిశ్రమలోకి వచ్చిన పవన్
కళ్యాణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుని కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు.
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ గా ఆయన ఇమేజ్ తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు అనే చెప్పాలి.
సినిమా సినిమా కు తన అప్పీల్ ను మార్చుకొని ప్రేక్షకులకు దగ్గరడానికి ఎంతో కృషి చేశాడు పవన్. ఇకపోతే ఆయన చేసిన సినిమాలలో ఎక్కువగా
రీమేక్ సినిమాలు పవన్ చేయడం కనిపిస్తుంది. పవన్
కళ్యాణ్ లాంటి రేంజ్ ఉన్న
హీరో ఇలా ఎక్కువగా
రీమేక్ సినిమాలు చేయడం ఏంటి అని అందరూ అనుకోవచ్చు.
దానికి ప్రత్యేక కారణం ఉందట. ఆయన కెరీర్ లో
బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు కూడా
రీమేక్ సినిమాలు చేయడం ద్వారానే హిట్ కొట్టాడు. తమ్ముడు, సుస్వాగతం, అన్నవరం, తీన్మార్, గబ్బర్ సింగ్, కాటమరాయుడు, గోపాల గోపాల, వకీల్ సాబ్ ఇవన్నీ ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలు. ఇక్కడ పవన్
కళ్యాణ్ కు తగ్గట్టుగా కొన్ని కొన్ని సీన్స్
మార్చి తెలుగులో విడుదల చేయగా అవి ఇక్కడ కూడా
బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే పవన్
కళ్యాణ్ కొన్ని డైరెక్ట్
సినిమాల్లో నటించగా అవి కూడా ఇతర భాషలలోకి
రీమేక్ అయ్యాయి.
ఒకరకంగా పవన్
కళ్యాణ్ చేసిన ఈ రకమైన సినిమాలు సేఫ్ అని చెప్పవచ్చు. టాప్
హీరో సినిమా అంటే కోట్లతో ముడిపడిన వ్యవహారం. ఏమాత్రం తేడా కొట్టిన
నిర్మాత రోడ్డు మీదకు రావడం ఖాయం. అలాంటప్పుడు
రీమేక్ సినిమాలను ఎంచుకొని ఉత్తమంగా పవన్ హిట్ కొట్టేవాడు.
రీమేక్ సినిమాలలో రిస్క్ తక్కువ ఉంటుంది అన్నట్లు పవన్
కళ్యాణ్ ఎక్కువగా
రీమేక్ సినిమాలు చేశాడు. ఇప్పుడు కూడా పవన్
కళ్యాణ్ చేస్తున్న భీమ్లా
నాయక్ రీమేక్ సినిమానే. అంతేకాదు ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలను భవిష్యత్తులో
రీమేక్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.