మన హీరోలు ఏదైనా చిన్న హీరో సినిమా విడుదలై థియేటర్ల లో బాగా ప్రదర్శింపబడుతూ ఉంటే ,ఆ సినిమాను మరింత జనాల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషిగా సినిమాను చూసి సినిమా బాగున్నట్లయితే వారి ఉద్దేశాలను న్యూస్ ఛానల్  ద్వారానో లేదా సోషల్ మీడియా ద్వారానో తెలియజేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో సార్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా ఓ సినిమా గురించి పొగడ్తల వర్షం కురిపించాడు. 

శ్రీ విష్ణు హీరోగా , మేఘ ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కి ఈ మధ్య విడుదలై జనాలలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా 'రాజా రాజా చొరా'  అయితే ఈ సినిమా గురించి రవితేజ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'రాజా రాజా చోరా' సినిమాను చూశాను. నాకు చాలా బాగా నచ్చింది ఎంటర్టైన్మెంట్ గా ఉంటూనే చాలా ఎమోషనల్ గా ఉంది. మొత్తానికి ఈ సినిమాను నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. హీరో శ్రీ విష్ణు కు దర్శకుడు హసిద్ గోలి కి అభినందనలు తెలియజేశాడు.

హీరో రవితేజ చేసిన ట్వీట్ కు స్పందించిన శ్రీ విష్ణు మా సినిమాను చూసి సోషల్ మీడియా ద్వారా స్పందించినందుకు చాలా థాంక్స్ సార్ అంటూ రీ ట్వీట్ చేశాడు. దర్శకుడు హసిత్ గోలి కూడా రవితేజ ట్వీట్ కి స్పందిస్తూ థాంక్స్ సార్ అంటూ రీ ట్వీట్ చేశాడు. 'రాజ రాజ చోరా' సినిమా గురించి మరి కొంత మంది ప్రముఖులు కూడా ట్వీట్ లు చేశారు. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' మరియు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో పాత్రలో మనకు కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: